బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు గృహ నిర్బంధం
హైదరాబాద్ నగరంలో రాహుల్‌గాంధీ(Rahul Gandhi) పర్యటన నేపథ్యంలో నేతల గృహ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. రాహుల్ పర్యటనను అడ్డుకుంటామని బీజేవైఎం (BJYM) ప్రకటించింది.ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా రాష్ట్రానికి రాహుల్ వస్తున్నారని విమర్శించింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు (Ramachandra Rao)ను పోలీసులు (Police) గృహనిర్బంధం చేశారు. తార్నాకలోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.







