సీనియర్ నటుడు గిరిబాబు కన్ను మూత
తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం నెలగొంది. టాలీవుడ్ సీనియర్ నటుడు గిరిబాబు(80) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. గిరిబాబు అసలు పేరు యెర్రా శేషగిరిరావు. 1946 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించారు.
ఇవి కూడా చదవండి
గిరిబాబు గా పేరొందిన ఈ తెలుగు సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా. ఇతడు సుమారు 4 దశాబ్దాలుగా దక్షిణ భారతదేశంలోని వివిధ భాషా చిత్రాలలో నటిస్తున్నారు .ఈయన ఎక్కువగా ప్రతినాయకుడు, హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషించారు . ఇతని తండ్రి నాగయ్య. శ్రీదేవి ఇతని భార్య 2016 మే 12 న మూత్రపిండాల వ్యాధితో మరణించారు. గిరిబాబు కొడుకులు రఘుబాబు (ప్రముఖ హాస్య నటుడు), బోసుబాబు. గిరిబాబు చిన్నతనంలోనే నాటకాల పట్ల ఆసక్తి పెంచుకుని సినిమాల్లోకి అడుగుపెట్టారు.విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్యనటుడిగా 600లకు పైగా చిత్రాల్లో నటించారు. 1973లో విడుదలైన ‘జగమే మాయ’ సినిమా ద్వారా నటుడిగా పరిచయమయ్యారు.1977లో వచ్చిన దేవతలారా దీవించండి సినిమా ద్వారా నిర్మాతగా మారారు. 2021లో సాక్షి ఎక్సలెన్స్ పురస్కారాలలో భాగంగా లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు.







