రాయల్ లుక్‌తో కుర్రాళ్ల మనసు దోచేస్తున్న శార్వరి!
బాలీవుడ్ బ్యూటీ శార్వరి(Sharvari) తన అందం, స్టైలిష్ లుక్స్‌తో మరోసారి ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటోంది. తాజాగా సంప్రదాయ వస్త్రధారణలో ఆమె చేసిన ఫొటోషూట్ సోషల్ మీడియాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. ఆలివ్ గ్రీన్ కలర్ అనార్కలీ ఎంబ్రాయిడరీ డ్రెస్‌లో గోల్డెన్ వర్క్‌తో మెరిసిపోతూ రాయల్ లుక్‌లో దర్శనమిచ్చింది. భారీ సంప్రదాయ చెవిపోగులు, సింపుల్ బిందీ, అందమైన హెయిర్ స్టైల్‌తో శార్వరి తన లుక్కు మరింత స్పెషాలిటీని తీసుకొచ్చింది. ప్రతి ఫొటోకూ శార్వరి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చూపు తిప్పుకోనివ్వడం లేదు. ముఖ్యంగా గోల్డెన్ ఎంబ్రాయిడరీతో కూడిన గ్రీన్ అవుట్‌ఫిట్ ఆమె అందాన్ని మరింత ఇనుమడింపజేస్తోంది. వెస్ట్రన్ ఫ్యాషన్‌లోనే కాదు, ట్రెడిషనల్ వేర్‌లోనూ తనదైన ముద్ర వేయగలనని శార్వరి ఈ ఫొటోషూట్‌తో ప్రూవ్ చేస్తోంది. గ్లామర్, ఎలిగెన్స్, ట్రెడిషనల్ స్టైల్ కలగలిసిన ఈ ఫొటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇవి కూడా చదవండి







