శంషాబాద్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్
శంషాబాద్ ఎయిర్‌పోర్టు (Shamshabad Airport)లో ఇండిగో విమానం (IndiGo aircraft) అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. కన్నూర్ (కేరళం) నుంచి వస్తున్న ఆ విమానంలో బాంబు (Bomb) ఉందని గుర్తు తెలియని వ్యక్తి పేపర్‌పై రాసి బాత్రూమ్లో పెట్టాడు. గమనించిన ప్రయాణికులు వెంటనే విమాన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పైలట్ అప్రమత్తమై శంషాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులను సురక్షితంగా దించి విమానంలో బాంబ్ స్క్వాడ్ (Bomb squad), సీఐఎస్ ఎఫ్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బెదిరింపులకు పాల్పడిన నిందితుడి కోసం ఆరా తీస్తున్నారు.







