టీటీఎస్ ఆధ్వర్యంలో మహిళల త్రోబాల్ టోర్నమెంట్.. డిసెంబర్ 12న క్రీడా వేడుక!
టెన్నెసీ తెలుగు సమితి (TTS) ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రత్యేకంగా ‘ఉమెన్స్ త్రోబాల్ టోర్నమెంట్ 2026’ను నిర్వహించనున్నారు. డిసెంబర్ 12, 2026, శనివారం మధ్యాహ్నం 3 నుండి రాత్రి 7 వరకు స్ప్రింగ్ హిల్‌లోని హజిల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ (Hustle Sports Complex, 5191 Joe Peay Rd, Spring Hill, TN 37174) వేదికగా ఈ టోర్నమెంట్ జరగనుంది.
ప్రతి జట్టులో 7 మంది ప్రధాన ఆటగాళ్లు , ఇద్దరు సబ్స్టిట్యూట్లు (7 + 2) ఉండాలని నిర్వాహకులు తెలిపారు. టోర్నమెంట్లో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ ఫీజు ప్రతి జట్టుకు $250 గా నిర్ణయించగా, రిజిస్ట్రేషన్ గడువు డిసెంబర్ 1, 2026తో ముగుస్తుంది. ఆసక్తి గల మహిళలు తమ జట్లతో కలిసి ఈ క్రీడా వేడుకలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు ఆహ్వానించారు.







