బండి సరోజ్‌కుమార్ ‘ఛప్రి’ టీజర్ ఆవిష్కరణ
‘మాంగళ్యం’, ‘పరాక్రమం’, ‘నిర్భంధం’తో అందరినీ మెప్పించిన బండి సరోజ్ కుమార్ ప్రస్తుతం ‘ఛప్రి’ అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్, ఎడిటింగ్, మ్యూజిక్, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతల్ని సరోజ్ నిర్వర్తించారు. BSK మెయిన్ స్ట్రీమ్ బ్యానర్ మీద సరోజ్, ప్రమోద్ పడమటి, పృథ్వీ చౌహాన్ నిర్మించిన ఈ సినిమాలో సరోజ్‌తో పాటుగా ఐశ్వర్య బోరా, దివ్య జ్యోతి, శ్లోకా, ప్రవీన్, మోహన్ ఆర్య, జీవా బాలచందర్, ప్రియాంక సింగ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. శనివారం నాడు ఈ మూవీ టీజర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్లో..
బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ .. ‘‘ఛప్రి’ సినిమాని సమ్మర్లో రిలీజ్ చేయాలని అనుకున్నాం. ఫిబ్రవరిలో టీజర్ ప్లాన్ చేశాం. కానీ ఈ మగాడు సీన్‌ని ఎవరో జూనియర్ ఆర్టిస్ట్ లీక్ చేశాడు. నేను ఎంతో ట్రామాని అనుభవించాను. అందుకే టీజర్‌ను ఇంత ఫాస్ట్‌గా వదిలాం. ఇండస్ట్రీలో, సెట్లో మాకు సెక్యూరిటీ లేదు. మీడియా లేకపోతే నేను లేను. నా ఈ జర్నీలో నన్ను సపోర్ట్ చేసిన విలేకరులకు ధన్యవాదాలు. ఈ కథను 700 రోజులు కష్టపడి రాశాను. రివ్యూయర్లను కూడా దృష్టిలో పెట్టుకుని పటిష్టమైన స్క్రీన్ ప్లేని రాసుకున్నాను. కథకు తగ్గట్టుగా నాకు మంచి ఆర్టిస్టులు దొరికారు. ఆర్ట్ డైరెక్టర్ నాని నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ప్రమోద్ అన్న నాకు అండగా నిలబడ్డారు. సమ్మర్లో కలుద్దాం. ఈ సినిమాతో మనమేంటో అందరికీ తెలుస్తుంది’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
నటుడు ప్రవీణ్ మాట్లాడుతూ .. ‘‘మోగ్లీ’ చిత్రంలో సరోజ్ గారిని చూసి నంబర్ తెలుసుకుని ఫోన్ చేసి మాట్లాడాను. సరోజ్ గారితో వర్క్ ఎక్స్‌పీరియెన్స్ చాలా కొత్తగా ఉంది. టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాను. వచ్చే ఏడాది సమ్మర్లో ‘ఛప్రి’ రిలీజ్ కాబోతోంది. హీరోగా సరోజ్కి థియేట్రికల్‌గా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
అజయ్ సాయి మాట్లాడుతూ .. ‘‘ఛప్రి’ టీజర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన సరోజ్ గారికి థాంక్స్. మున్ముందు మరిన్ని అప్డేట్లతో మీ ముందుకు వస్తామ’ని అన్నారు.
దివ్య జ్యోతి మాట్లాడుతూ .. ‘‘ఛప్రి’ సినిమాలో అద్భుతమైన పాత్రను ఇచ్చిన సరోజ్ గారికి థాంక్స్. ఈ జర్నీలో ‘ఛప్రి’ టీం ఎంతో సపోర్ట్ చేసింది’ అని అన్నారు.
రమేష్ మాట్లాడుతూ .. ‘సరోజ్ గారితో నేను మూడో సారి నటిస్తున్నాను. నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ వస్తున్న సరోజ్ గారికి థాంక్స్’ అని అన్నారు.
జీవా మాట్లాడుతూ .. ‘‘సరోజ్ గారిని చూసి ఎంతో ఇంప్రెస్ అవుతుంటాను. ‘ఛప్రి’ ఆడిషన్స్ కోసం సరోజ్ గారికి మెసెజ్ పెట్టాను. నన్ను నమ్మి మంచి పాత్రను ఇచ్చిన సరోజ్ గారికి థాంక్స్. ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
ప్రమోద్ పడమటి మాట్లాడుతూ .. ‘సరోజ్ గారితో నాకు ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. ముందుగా మేం ‘నిర్బంధం’ని నెట్ ఫ్లిక్స్ కోసం అనుకున్నాం. కానీ చివరకు యూట్యూబ్‌లోకి తీసుకు వచ్చాం. మాకు అక్కడ అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు సరోజ్ ‘ఛప్రి’తో ఆడియెన్స్ ముందు రాబోతోన్నారు. థియేటర్లో ‘ఛప్రి’ దద్దరిల్లిపోతుంది’ అని అన్నారు.
ఐశ్వర్య మాట్లాడుతూ .. ‘సరోజ్ గారితో వర్క్ చేయడం కొత్త అనుభూతిని ఇచ్చింది. అస్సాం నుంచి ఇక్కడకు వచ్చి ఇలా ‘ఛప్రి’లో నటించడం ఆనందంగా ఉంది. మా సినిమా అద్భుతంగా వచ్చింది’ అని అన్నారు.







