‘గోట్’ మూవీని చూసిన ప్రతీ ఒక్కరూ అద్బుతంగా ఉందని మెచ్చుకుంటున్నారు – నిర్మాత మొగుళ్ల చంద్రశేఖర్
థియేటర్లో ప్రేక్షకుల స్పందన చూసి మాకు సంతృప్తి కలిగింది – ‘గోట్’ సక్సెస్ మీట్లో హీరోయిన్ దివ్య భారతి
జైష్ణవ్ ప్రొడక్షన్స్, మహతేజ క్రియేషన్స్ బ్యానర్ల మీద మొగుళ్ల చంద్రశేఖర్ నిర్మాతగా, రవిందర్ రెడ్డి సహ నిర్మాణంలో సుడిగాలి సుధీర్ హీరోగా వేదవ్యాస్ తెరకెక్కించిన చిత్రం ‘గోట్’. ఈ సినిమాలో నితిన్ ప్రసన్న, దివ్య భారతి కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమా నవంబర్ 12న విడుదలై బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో శనివారం నాడు సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..
నిర్మాత చంద్రశేఖర్ మాట్లాడుతూ .. ‘‘మాది మూడేళ్ల ప్రయాణం. ఈ జర్నీలో మాకు ఎదురైన సవాళ్ల గురించి అందరికీ తెలుసు. వేద వ్యాస్ గారు ఎంట్రీ ఇచ్చాకే ఈ కథకు ప్రాణం వచ్చింది. మంచి మెసెజ్ ఇచ్చేలా సినిమాని రూపొందించాం. మూవీని చూసిన ప్రతీ ఒక్కరూ అద్బుతంగా ఉందని మెచ్చుకుంటున్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా కూడా పట్టు వీడకుండా చివరి వరకు నిలబడి సినిమాను ఇక్కడి వరకు తీసుకు వచ్చాను. నేను ఈ సినిమా జర్నీలో పడిన కష్టాల్ని ఓ చిత్రంగా తీస్తాను. నాకు ఈ జర్నీలో దివ్య భారతి గారు ఎంతో సహకరించారు. మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
దివ్య భారతి మాట్లాడుతూ .. ‘‘గోట్’ మూవీని ఆడియెన్స్ థియేటర్లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. నా మీద అంతులేని ప్రేమను కురిపిస్తున్నారు. మేం ఈ చిత్రం కోసం పడిన కష్టం వృథా కాలేదని ఆడియెన్స్ రియాక్షన్స్ చూస్తే అర్థమైంది. ప్రేక్షకుల స్పందన చూసి మాకు సంతృప్తి కలిగింది. ‘గోట్’ చిత్రానికి వస్తున్న స్పందన చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. పట్టు వదలకుండా నిలబడిన మా నిర్మాత చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు. మాకు అండగా నిలబడిన వేద వ్యాస్ గారికి థాంక్స్’ అని అన్నారు.
దర్శకుడు వేద వ్యాస్ మాట్లాడుతూ .. ‘‘గోట్’ సినిమాకి థియేటర్లో అద్భుతమైన స్పందన వస్తోంది. అక్కడ ఆడియెన్స్ రియాక్షన్స్ చూసి నేను ఎంతో ఎంజాయ్ చేశాను. మాకు సపోర్ట్ చేస్తున్న మీడియా, ఆడియెన్స్‌కి థాంక్స్. ఈ మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ సక్సెస్ ప్రతీ ఒక్కరికీ చెందుతుంది. బెట్టింగ్ అనేది ఫన్. కానీ లైన్ క్రాస్ చేయకూడదు. ఆ పాయింట్‌ని నేను కాస్త వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాను. ఈ సినిమాని చూసి బెట్టింగ్ ఒక్కడు ఆపినా చాలు’ అని అన్నారు.
నితిన్ ప్రసన్న మాట్లాడుతూ .. ‘‘గోట్’ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లు అన్నీ ఫుల్ అవుతున్నాయి. ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. వేదవ్యాస్ గారు కథను మాకు అద్భుతంగా నెరేట్ చేశారు. వేద వ్యాస్ గారు ఈ చిత్రంతో మంచి సందేశాన్ని ఇచ్చారు’ అని అన్నారు.
మాస్టర్ మురారి మాట్లాడుతూ ..‘నా పాత్రకు ఇలాంటి అద్భుతమైన స్పందన వస్తుందని మా దర్శక, నిర్మాతలు ముందే చెప్పారు. వారు చెప్పినట్టుగానే జరిగింది. ఇంకా మున్ముందు ఇలానే అందరినీ ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాను’ అని అన్నారు.







