గిగ్ వర్కర్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది :రాహుల్ గాంధీ
గిగ్ వర్కర్ల సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి ప్రసంగం…
* మీరు ఎలా ఉన్నారంటూ గిగ్ వర్కర్లను పలుకరించిన రాహుల్ గాంధీ..
* గిగ్ వర్కర్ల బాధ, నొప్పి తనకు తెలుసన్న రాహుల్ గాంధీ
* గిగ్ వర్కర్ల కష్టం గుర్తించే నేను, మా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తామని నాడు హామీ ఇచ్చాం, వాగ్దానం చేశాం..
* మేం ఆ వాగ్దానాన్ని మేం నెరవేర్చాం….
* గిగ్ వర్కర్లకు సంబంధించిన డేటా ఇప్పటి వరకు భారత దేశంలో లేదు..
* డెలివరీకి సంబంధించి ఎంత సమయం పడుతుంది… ఎంత ఇస్తారనే సమాచారం కూడ లేదు. కష్టం మీది కానీ మీ సమాచారం మీ దగ్గర లేదు..
* తెలంగాణ ప్రభుత్వం మీ కోసం పని చేస్తోంది.. ప్రతి డెలివరీపై మీకు వచ్చే దానిని మీకు తెలియజేస్తోంది.
* తెలంగాణలో నగరాల్లో ఎండల్లో మీరు మోటార్ సైకిళ్లపై వెళుతుంటారు. మీకు విశ్రాంతి కోసం ఎటువంటి రెస్ట్ హౌజ్‌లు లేవు..
* ఇప్పుడు మీరు రెస్ట్ తీసుకునేందుకు హైదరాబాద్‌లో, తెలంగాణలోని ఇతర నగరాల్లో తెలంగాణ ప్రభుత్వం రెస్ట్ హౌజ్‌లు నిర్మించింది..
* గిగ్ వర్కర్లకు అనారోగ్యం వచ్చినప్పుడు రూ.5 లక్షల ప్రమాద బీమా, రూ.పది లక్షల ప్రమాద బీమాను తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది..
* గిగ్ వర్కర్లకు పింఛను, ఇతర సౌకర్యాలు అందుతాయి….
* ప్రతి డెలివరి, ప్రతి రవాణాకు సంబంధించిన 1 శాతం మీ గిగ్ వర్కర్ల ఖాతాలో చేరుతుంది. ఆ డబ్బు గిగ్ వర్కర్ల బోర్డుకు చేరుతుంది. అక్కడి నుంచి మీ ఖాతాకు చేరుతుంది.
* దేశంలో రెండు ఆలోచన విధానాలు ఉన్నాయి…. 1. ఆర్ఎస్ఎస్, బీజేపీ విధానం.. అది కట్టు బానిసత్వాన్ని కోరుతుంది.. 24 గంటలు పని చేయాలి. శ్రమను దోచుకునేవి.. మీ శ్రమను అదానీకి, అంబానీకి దోచిపెట్టేవి. 2. గిగ్ వర్కర్.. దేశానికి పునాది, దేశ భాగస్వామి అని కాంగ్రెస్ ఆలోచన విధానం. గిగ్ వర్కర్‌కు రక్షణ కల్పించాలనేది కాంగ్రెస్ ఆలోచన…
* మీకు ప్రతి డెలివరిలో వాటా రావాలని, మీకు రెస్ట్ దొరకాలని కాంగ్రెస్ భావిస్తోంది..
* నరేంద్ర మోదీ ఆలోచన విధానం…మీకు ఏం దక్కవద్దంటోంది..
* రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీ పిల్లలకు చదువు, మీ ఆరోగ్యానికి అండగా ఉంటుంది..
* మీరు భయపడవద్దు.. మీకు మేం అండగా ఉంటాం…
* జై హింద్.. జై తెలంగాణ







