నిర్మాతగా కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్న సాయిధరమ్ తేజ్!
మెగా హీరో సాయిధరమ్ తేజ్(sai dharam Tej) త్వరలో నిర్మాతగా కొత్త అవతారం ఎత్తబోతున్నారు. టాలీవుడ్ లో విభిన్నమైన కథలను ప్రోత్సహించాలనే ఆలోచనతో ఆయన నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో యంగ్ డైరెక్టర్ శశికిరణ్ తిక్కా(Sasikiran thikka) చెప్పిన ఓ కథా ఆలోచన తేజ్‌కు బాగా నచ్చిందని సమాచారం. గతంలో అడివి శేష్(Adivi Sesh) హీరోగా వచ్చిన మేజర్(Major) సినిమాతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శశికిరణ్ ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. వచ్చే సంవత్సరం షూటింగ్ మొదలుపెట్టేలా ప్లాన్స్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
అయితే ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ స్వయంగా హీరోగా నటిస్తారా? లేదంటే కొత్త నటుడిని హీరోగా పరిచయం చేస్తారా? అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడితేనే పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి తేజ్ కీలక ప్రకటన చేసే అవకాశముంది.
మరోవైపు ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్న సాయిధరమ్ తేజ్ డిసెంబర్ 10న హైదరాబాద్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఆయన నటించిన సంబరాల ఏటి గట్టు షూటింగ్ పూర్తైంది. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఇక డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమాను ఇటీవలే సెట్స్‌పైకి తీసుకెళ్లారు. ఈ సినిమాను 2027 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం భావిస్తోంది.







