టాలీవుడ్‌పై కాజల్ ఎమోషనల్ కామెంట్స్
టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్(Kajal aggarwal). డార్లింగ్(Darling), బృందావనం(Brindavanam), నాయక్(nayak), మిస్టర్ పర్ఫెక్ట్(Mr. Perfect) వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆమె స్టైల్, ఫ్యాషన్, స్క్రీన్ ప్రెజెన్స్‌కు అప్పట్లో యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. బాలీవుడ్ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాజల్.. తాజాగా తెలుగు భాష, సంస్కృతితో తనకున్న బాండింగ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఇవి కూడా చదవండి
మొదట తెలుగు భాష, సంస్కృతి, ఇక్కడి జీవనశైలికి అలవాటు పడటం కొంత కష్టంగా అనిపించిందని చెప్పిన కాజల్, సౌత్ ముంబైలో పెరిగిన తనకు తెలుగు సంప్రదాయాలు, వస్త్రధారణ, భాష కొత్తగా అనిపించాయని, అయితే కాలక్రమేణా వాటికి దగ్గరయ్యానని చెప్పారు. తన లైఫ్ లో ఎక్కువ భాగం హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోనే గడిచిందని, ఇప్పుడు తనను తాను తెలుగు అమ్మాయిగానే భావిస్తున్నానని వెల్లడించారు.
అంతేకాదు, తన పెళ్లిలోనూ తెలుగు సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు కాజల్ పేర్కొన్నారు. తాను పంజాబీ కుటుంబానికి చెందినప్పటికీ, భర్త గౌతమ్ కిచ్లు(Gowtham ktcthlu) కశ్మీరీ నేపథ్యం కలిగిన వారైనా తెలుగు సంప్రదాయాలను పెళ్లిలో భాగం చేసుకున్నామని తెలిపారు. తెలుగు సంస్కృతి తన లైఫ్ లో ఎంతగా భాగమైందో చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆమె చెప్పారు. ఇతర ఇండస్ట్రీలతో పోలికలు పెట్టకుండా తనకు గుర్తింపు, ప్రేమను అందించిన తెలుగు చిత్ర పరిశ్రమపై కృతజ్ఞత చాటుకుంటున్న కాజల్ మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.







