2027పై దిల్ రాజు గురి.. లైనప్‌లో ఐదు క్రేజీ సినిమాలు!
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు(Dil Raju) 2027ను టార్గెట్ గా చేసుకుని భారీ సినిమాల రిలీజ్ కు ప్లాన్ ను రెడీ చేస్తున్నారు. గత కొంతకాలంగా నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోలేకపోయిన ఆయన.. రామాయణ(ramayana), సీన్(Scene) వంటి సినిమాల డిస్ట్రిబ్యూషన్ తో మళ్లీ జోరు పెంచారు. ఈ క్రమంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(Sri venkateswara Creations) బ్యానర్‌పై 2027లో ఏకంగా ఐదు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అక్షయ్ కుమార్(Akshay kumar) హీరోగా సంక్రాంతికి వస్తున్నాం హిందీ రీమేక్, సల్మాన్ ఖాన్(Salman khan) మాన్స్టర్(Monster), దేవిశ్రీ ప్రసాద్(Devi sri prasad) హీరోగా ఎల్లమ్మ(Yellamma), విజయ్ దేవరకొండ(Vijay devarakonda) రౌడీ జనార్దన(Rowdy Janardhana), ఆశిష్(Asish) నటిస్తున్న దేత్తడి(Dethadi) ఈ లిస్ట్ లో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
ఈ ఐదు సినిమాల్లో భారీ అంచనాలున్న సల్మాన్ ఖాన్ మాన్స్టర్ ను ఈద్ 2027 సందర్భంగా రిలీజ్ చేయాలని దిల్ రాజు భావిస్తున్నారు. అక్షయ్ కుమార్ సినిమా ఫిబ్రవరిలో, ఎల్లమ్మ మార్చి 5న రిలీజ్ కానున్నాయి. విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా కాంబినేషన్లో తెరకెక్కుతున్న రౌడీ జనార్దన ను సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు. ఆశిష్ దేత్తడి రిలీజ్ డేట్ ను షూటింగ్ పూర్తయ్యాక అనౌన్స్ చేయనున్నారు. వీటితో పాటు మరో నాలుగు ప్రాజెక్టులు ప్రీ ప్రొడక్షన్లో ఉన్నట్లు వెల్లడించారు.
ఇక అనిల్ రావిపూడి(Anil ravipudi)తో తెరకెక్కించే సినిమాను సంక్రాంతి 2028కి రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. రవితేజ(Raviteja)తో వీరాధి వీరులంతా(Veeradhi Veerulantha) సినిమాను 2027 ఫిబ్రవరిలో ప్రారంభించనున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్(pawan kalyan)తోనూ ఓ సినిమా కోసం డిస్కషన్స్ జరిపినట్లు దిల్ రాజు వెల్లడించారు. మొత్తంగా వరుస ప్రాజెక్టులతో SVCని మళ్లీ బిజీగా మార్చే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు.







