‘ఇట్లు అర్జున’ తో అనీష్ హీరోగా పాసయ్యాడు. తన విషయంలో చాలా గర్వంగా ఉంది: కింగ్ నాగార్జున
‘ఇట్లు అర్జున’కు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. సినిమా చూసి ప్రేక్షకులంతా క్లాప్స్ కొడుతుంటే తొలి సినిమా నటుడిగా ఎంతో సంతోషాన్నిచ్చింది: హీరో అనీష్
కింగ్ నాగార్జున సమర్పణలో వచ్చిన లేటెస్ట్ హార్ట్బస్టర్ ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయమైన ఈ చిత్రంలో అనస్వర రాజన్ కథానాయికగా నటించింది. మహేష్ ఉప్పల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. దర్శకుడు వెంకీ కుడుముల వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఇట్లు అర్జున’ నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది.
సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది నాకు చాలా నోస్టాల్జిక్ మూమెంట్. ఎందుకంటే ‘శివ’ సినిమా పూర్తయిన తర్వాత ఫస్ట్ కాపీని ఇక్కడే చూశాం. అందుకే దీనికి శివ థియేటర్ అని కూడా పేరు పెట్టాం. ముందుగా ఇట్లు అర్జున సినిమా టీమ్ అందరికీ అభినందనలు. ఈ సినిమాకు డీఓపీ రాజా కూడా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. ఈ సినిమా చూసే నా 100వ సినిమాకు తనను డీఓపీగా తీసుకున్నా, దర్శకుడు మహేష్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. మాటలు రాని హీరోతో ఒక కథ చెప్పడం అంత ఈజీ కాదు. అలాంటి కథను చాలా అద్భుతంగా తీశాడు. యాక్షన్, సౌండ్.. ఇలా ప్రతి అంశాన్ని అద్భుతంగా డిజైన్ చేశారు. మహేష్‌కు చాలా గొప్ప భవిష్యత్తు ఉంటుంది. వెంకీ ప్రొడక్షన్ ను అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. సినిమా చూసిన తర్వాత అనస్వరకు నేను ఫ్యాన్ అయిపోయాను. తను చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. ఈ సినిమా చూసిన ఆడియన్స్ అనీష్ గురించి చాలా గొప్పగా చెబుతున్నారు. తను నిజంగా సాధించాడు. చాలా మంచి క్యారెక్టర్‌ను పోషించాడు. అనీష్ విషయంలో నాకు చాలా గర్వంగా ఉంది. రోజురోజుకీ వర్డ్ ఆఫ్ మౌత్ పెరుగుతోంది. నేను ఈ సినిమాను ప్రజెంట్ చేసినందుకు నా మాట నిలబెట్టారు. అనీష్ ఈ సినిమాతో హీరోగా పాస్ అయ్యాడు. చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా విజయం టీమ్ అందరికీ దక్కుతుంది. ఇంత మంచి హార్ట్బస్టర్ సక్సెస్ అందుకున్న అందరికీ కంగ్రాట్యులేషన్స్.
హీరో అనీష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మీరందరూ ఇస్తున్న ప్రేమకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఫస్ట్ హీరో మ్యూజిక్ . నేను ఈ కథ విన్నప్పుడే అదే నమ్మాను. ఈరోజు అందరూ తమన్ గారి మ్యూజిక్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయన ఈ కథను, సినిమాను టీమ్ ఎంతగా ప్రేమించారో నాకు తెలుసు. థియేటర్లో కూర్చొని నన్ను నేను చూసుకున్నప్పుడు ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను ఎంతగానో ఎంజాయ్ చేశాను. వెంకీ గారు కథను నమ్మి నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని భావిస్తున్నాను. అందరూ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఎడిటింగ్ కూడా చాలా బాగుందని అంటున్నారు. అంత చక్కగా ఎడిట్ చేసిన కోటికి థాంక్యూ. అలాగే రాజాకు కూడా థాంక్యూ. తను అందరినీ సర్ప్రైజ్ చేసే విజువల్స్ ఇచ్చారు. కీర్తి పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన అనస్వరకు థాంక్యూ. ఇలాంటి కథ రాసి, నన్ను నమ్మి నాతో ప్రయాణించిన మా డైరెక్టర్ మహేష్ గారికి థాంక్యూ. క్లైమాక్స్‌లో అందరూ చప్పట్లు కొడుతుంటే తొలి సినిమా నటుడిగా నాకు ఎంతో ఆనందం కలిగింది. నా పెర్ఫార్మెన్స్కు ఎంత పేరు వచ్చినా, దానికి కారణం డైరెక్టర్ మహేష్ గారే. ఆయన దగ్గరుండి నన్ను ఎంతో ప్రోత్సహించి నటింపజేశారు. ఇంకా సినిమా చూడని వారు థియేటర్లకు వెళ్లి చూడండి. ఇది చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. యాక్షన్‌ను కూడా ఎంజాయ్ చేస్తారు. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నాగార్జున గారి సపోర్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ జర్నీలో మొదటి రోజు నుంచి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.
ఇవి కూడా చదవండి
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. సినిమాకు చాలా అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమాకు మాకు సపోర్ట్ చేసిన చరణ్ గారికి, ఎన్టీఆర్ గారికి పేరుపేరునా ధన్యవాదాలు. సినిమా ప్రీమియర్స్ చూస్తున్నప్పుడే ఎంతమంది సినిమాను ప్రేమిస్తున్నారో నాకు అర్థమైంది. ఒక సినిమా సక్సెస్ అయిందంటే అది ఇండస్ట్రీ సక్సెస్. ఇంత మంచి విజయాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. మహేష్ సినిమాను చాలా అద్భుతంగా తీశాడు. తను చాలా మంచి కథను అందించాడు. తన విషయంలో చాలా గర్వంగా ఉంది. రాజా ప్రతి విజువల్‌ను ఒక పెయింటింగ్‌లా అందించారు. వెంకీ కుడుముల ఈ సినిమాకు వెన్నుముక. అనస్వర అద్భుతంగా నటించింది. అనీష్ విషయంలో నాకు చాలా గర్వంగా ఉంది. తను బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలాగే ఈ సినిమాలో పాట పాడిన అనిరుద్ కి థాంక్యూ. ఈ సినిమా మ్యూజిక్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ సినిమా విజయం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
నిర్మాత వెంకీ కుడుముల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను మా టీం ను నమ్మాను. వాళ్లందరూ కూడా నా నమ్మకాన్ని నిజం చేశారు. సినిమాకు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మా సినిమాకు బిగ్గెస్ట్ సపోర్ట్ తమన్ గారి మ్యూజిక్. ప్రతి ఒక్కరూ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటున్నారు. థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా పాటల గురించి మాట్లాడుకుంటున్నారు. అనీష్ విషయంలో నేను చాలా గర్వంగా ఉన్నాను. తను బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలాగే అనస్వర కూడా చాలా చక్కగా నటించింది. సినిమా చూసి చాలామంది సర్ప్రైజ్ అవుతున్నారు. నాగార్జున గారి సపోర్ట్‌ను మర్చిపోలేను. సినిమా చూసిన వాళ్లందరూ బాగుందని చెబుతున్నారు. ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇంత అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు.
అనస్వర రాజన్ మాట్లాడుతూ.. సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇస్తోంది. కొన్ని థియేటర్లను విజిట్ చేశాం. అక్కడి నుంచి వస్తున్న స్పందన మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ప్రతి సీన్‌ను ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు.ఈ సినిమాకు మ్యూజిక్ ప్రధాన ఆకర్షణ అని ప్రేక్షకులు చెబుతున్నారు. అందుకు తమన్ గారికి ధన్యవాదాలు. అనీష్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. డైరెక్టర్ మహేష్ గారికి, కీర్తి, అర్జున్ పాత్రలకు ఆడియన్స్ ఇస్తున్న ప్రేమ, ఆదరణ చాలా సంతోషాన్నిస్తోంది. తప్పకుండా ఈ సినిమాను మీరందరూ థియేటర్లలో చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.
దర్శకుడు మహేష్ ఉప్పల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాకు వస్తున్న అద్భుతమైన ఆదరణ నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ఇలాంటి ఛాలెంజింగ్ కథను ఒప్పుకున్న మా నిర్మాత వెంకీ గారికి ధన్యవాదాలు. ఆయన నా మీద నమ్మకం ఉంచారు. ఈ ప్రయాణంలో అనీష్ నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. తమన్ గారు నా సినిమాకు మ్యూజిక్ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను. మ్యూజిక్కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అలాగే అనస్వరకు థాంక్యూ. ఈ సినిమా కోసం ప్రేక్షకులను అలరించడానికి ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ ఎంతో కష్టపడ్డారు.
అనీష్ తన నటనతో అందరినీ సర్ప్రైజ్ చేశాడు. ప్రతి సినిమాతో ప్రేక్షకులు తనను మరింతగా ఇష్టపడతారు. మంచి కథ, స్క్రీన్‌ప్లే, పెర్ఫార్మెన్స్ ఉంటే ఆడియన్స్ తప్పకుండా సపోర్ట్ చేస్తారని మరోసారి ప్రూవ్ చేశారు. నాగార్జున గారు ఈ సినిమాను సమర్పించడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇప్పటివరకు సినిమా చూసిన వాళ్లందరూ పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు. ఇంకా చూడని వాళ్లు థియేటర్లకు వెళ్లి చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.







