ఎన్టీఆర్‌తో అనిల్ రావిపూడి.. త్వరలోనే ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్!
టాలీవుడ్లో వరుస సక్సెస్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil ravipudi), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR)తో సినిమా చేయాలనే తన చిరకాల కోరికను త్వరలోనే నెరవేర్చుకోబోతున్నారు. గతంలో పలుమార్లు ఈ క్రేజీ కాంబినేషన్‌పై డిస్కషన్స్ జరిగినప్పటికీ, ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. అయితే తాజాగా ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్‌రామ్(Nandamuri Kalyan ram)లతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన అనిల్ రావిపూడి, తమ కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్లు అఫీషియల్ గా వెల్లడించారు. ఈ ప్రాజెక్టును ఎన్టీఆర్ ఆర్ట్స్(NTR Arts) సంస్థ నిర్మించనుంది. దీంతో నందమూరి అభిమానుల్లో ఈ అనౌన్స్మెంట్ ఆసక్తిని పెంచుతోంది.
ఈ సందర్భంగా అనిల్ రావిపూడి తనదైన శైలిలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ఎన్టీఆర్‌తో తమ కాంబినేషన్ ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉందని, త్వరలోనే ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ ను అందించే సినిమా మొదలు కానుందని పేర్కొన్నారు. అంతేకాదు, సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లడమే కాదు, ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తుతుందని చమత్కారంగా వెల్లడించారు. విశేషమేమిటంటే.. అనిల్ రావిపూడి డైరెక్టర్ గా పరిచయమైన పటాస్(Patas) సినిమాను కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పైనే కల్యాణ్‌రామ్ నిర్మించారు. ఇప్పుడు అదే నిర్మాణ సంస్థ ద్వారా ఎన్టీఆర్‌తో ఆయన సినిమా చేయనుండటం ప్రత్యేకతను సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి
ప్రస్తుతం అనిల్ రావిపూడి వెంకటేష్(Venkatesh), కల్యాణ్‌రామ్‌లతో జనవరి 12 విడుదల(January 12 vidudhala) సినిమాను తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి 2027 కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్(prasanth neel) దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్(Dragon) తో బిజీగా ఉండగా, త్రివిక్రమ్(Trivikram)తో గాడ్ ఆఫ్ వార్(God Of War) ప్రాజెక్ట్ కూడా ఆయన లైనప్‌లో ఉంది. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎన్టీఆర్‌ను ఆయన ఎలాంటి క్యారెక్టర్ లో చూపించబోతున్నారు? అనే ప్రశ్నలు ఫ్యాన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.







