హోస్టన్ లోని శ్రీ మీనాక్షి టెంపుల్ లో వైభవంగా ముగిసిన స్కంద షష్ఠి ఉత్సవాలు
హోస్టన్ లోని ప్రముఖ శ్రీ మీనాక్షి టెంపుల్ లో (sri Meenakshi temple, pearland TX) స్కంద షష్ఠి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. నవంబర్ 9 వ తేదీన అభిషేకంతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు.. నవంబర్ 14 న సుబ్రహ్మణ్యునికి తిరు కల్యాణం, ప్రసాద వితరణతో ఈ ఉత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా ప్రధాన మూర్తులకు ప్రత్యేకంగా అభిషేకాలు, ప్రత్యేక హోమాలు, అలంకరణ, ఉపచారాలు వేద మంత్రాల మధ్య అర్చకులు నిర్వహించారు.
ఇందులో భాగంగా నవంబర్ 9 న సాయంత్రం 7:00 గంటలకు అభిషేకం, అలంకరణ, ఉపచారాలతో ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. నవంబర్ 10 న అభిషేకం, అలంకరణ, ఉపచారాలు, నవంబర్ 11 న యథావిథిగా, శాస్త్రోక్తంగా అభిషేకాలు, అలంకరణ, ఉపచారాలు జరిగాయి. నవంబర్ 12 న అభిషేకం, అలంకరణ, ఉపచారాలు జరగ్గా, సాయంత్రం 6:30 గంటలకు getting vel from mother meenakshi కార్యక్రమం జరిగింది. తర్వాత అభిషేకం, అలంకరణ, ఉపచారాలను నిర్వహించారు.

ఇక.. చివరి రోజైన నవంబర్ 14 న ఉదయం 8:30 నిమిషాలకు స్కంద హోమం, అభిషేకం, అలంకరణ, ఉపచారాలు నిర్వహించారు. దీని తర్వాత ఉదయం 10:30 గంటల నుంచి సుర సంహారం, ప్రాయశ్చిత అభిషేకం, సుబ్రహ్మణ్యునికి, దైవాణికి తిరు కల్యాణం నిర్వహించారు. చివరగా మహా హారతి, ప్రసాద వితరణతో ఈ ఉత్సవాలు ముగిశాయి.
ఈ ఉత్సవాలకు కుమార్ భాష్యం, సేతు రామన్ రామన్, ముత్తు కుమార్ సమన్వయ కర్తలుగా వ్యవహరించారు.
ఇప్పటి నుంచి ఈ దేవాలయంలో జరగబోయే ఉత్సవాల గురించి ముందుగా తెలుసుకొని, పాల్గొనాలని భావించే వారు (281) 489-0358 EXT, 100 OR 110 లేదా Hema :[email protected] లేదా 832-215-2626 నెంబర్లలో సంప్రదించవచ్చును.







