టికెట్ ధరల పెంపునకు రౌడీ హీరో నో.. రాజమౌళికి మాత్రం మినహాయింపు!
సినిమా బడ్జెట్లు పెరుగుతున్న కొద్దీ టికెట్ ధరలు కూడా పెరుగుతుండటం ఆడియన్స్ కు భారంగా మారుతోంది. ముఖ్యంగా భారీ అంచనాలతో రిలీజయ్యే సినిమాలకు ధరల పెంపు అమలు చేయడం వల్ల థియేటర్లకు వెళ్లే రెగ్యులర్ ఆడియన్స్ సంఖ్యపై ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ(vijay devarakonda) తీసుకున్న డెసిషన్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తన కంట్రోల్ లో ఉన్నంతవరకు ఇకపై తాను నటించే సినిమాలకు టికెట్ ధరలు పెంచే విధానానికి దూరంగా ఉంటానని విజయ్ క్లారిటీ ఇచ్చారు. ఆడియన్స్ కు సినిమా ఎంటర్టైన్మెంట్ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో విజయ్ చేసిన ఈ అనౌన్స్మెంట్ కు ప్రాధాన్యత ఏర్పడింది.
అయితే, ఈ విషయంలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli)తో సినిమా చేస్తే మాత్రం మినహాయింపు ఉంటుందని విజయ్ సరదాగా పేర్కొనడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. రాజమౌళి సినిమాలకు ఉండే భారీ స్థాయి, నిర్మాణ వ్యయం, అంచనాల నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. ప్రస్తుతం టికెట్ ధరల పెంపుపై ఆడియన్స్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో విజయ్ డెసిషన్ ఇండస్ట్రీలో ఎలాంటి చర్చకు దారితీస్తుందో చూడాలి. సినిమా సక్సెస్ కు కలెక్షన్లతో పాటూ ప్రేక్షకుల ఆదరణ కూడా కీలకమనే అభిప్రాయానికి ఆయన వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
ఇక విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్(Rahul Sankrityan) కాంబినేషన్లో రూపొందుతున్న తాజా సినిమా రణబాలి(ranabaali). గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ట్యాక్సీవాలా(Taxiwala) ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈసారి పీరియడ్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రష్మిక మందన్నా(rashmika mandanna) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) నిర్మిస్తోంది. ప్రమోషన్లలో విజయ్ చేసిన టికెట్ రేట్ల వ్యాఖ్యలు సినిమాపై ఉన్న ఆసక్తికి మరో అంశాన్ని జోడించాయి.








