దేశంలోనే అధ్యాత్మిక కేంద్రంగా ఏపీ : మంత్రి ఆనం
శ్రీవారి ట్రస్టు ద్వారా 175 నియోజకవర్గాల్లో 175 దేవాలయాలు నిర్మిస్తామని మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) అన్నారు. పొదలకూరు మండలం మహ్మదాపురంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి (Somireddy)తో కలిసి పర్యటించారు. రూ. 2 కోట్లతో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానానికి (Sri Venkateswara Swamy Devasthanam) భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ దేశంలోనే ఏపీ అధ్యాత్మిక కేంద్రంగా నిలవనుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5500 ఆలయాలు (Temples) నిర్మిస్తామన్నారు. 2028 చివరి నాటికి 5 వేల ఆలయాలు పూర్తి కానున్నాయని వెల్లడించారు. దూప, దీప, నైవేద్యాల పథకం కింద 6700 ఆలయాలకు రూ.10 వేల చొప్పున అర్చకులకు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఒకటిన్నర ఏడాదిలో 4 కోట్ల మంది భక్తులకు అన్నప్రసాదం అందించామన్నారు. రాష్ట్రంలో 151 ఆలయాలల్లో నిత్యాన్నదానం జరుగుతుందన్నారు.








