గతంతో పోలిస్తే .. ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి : చిరంజీవి
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi) అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో పర్యటించిన మెగాస్టార్ జీఎస్ ఎల్ ఆస్పత్రి (GSL Hospital), సూర్య ఛారిటబుల్ ట్రస్ట్ (Surya Charitable Trust) సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించిన హెల్త్ కేర్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ గతంతో పోలిస్తే రాష్ట్రంలో అనేకరంగాల్లో పురోగతి కనిపిస్తోందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణపైనా తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్లాసిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే హానిని గుర్తించి, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. చాలా కాలం తర్వాత కోనసీమ (Konaseema ) ప్రాంతానికి చిరంజీవి రావడంతో అభిమానుల్లో సందడి నెలకొంది.








