వారిని తీసుకొస్తా .. రామచందర్ రావుకు మంత్రి పొన్నం సవాల్
ఓటు కోల్పోయినా ఒక్కరినైనా చూపించగలరా, అంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు (Ramachander Rao) చేసిన సవాల్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) స్పందించారు. ఓటు కోల్పోయిన వారిని తీసుకొస్తానని, తేదీ ( Date), సమయం (Time) చెప్పాలని సవాల్ విసిరారు. సర్ పేరుతో దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఓట్లు తొలగించారని ఆరోపించారు. రాష్ట్రంలో 70 లక్షల ఓట్లు, హైదరాబాద్ ( Hyderabad) లో 40 లక్షల ఓట్లు పోయాయన్నారు. ఓటరు జాబితా సమగ్ర ప్రక్షాళనను సరిగా చేయాలని, అంతేగానీ ఓటు కోసం కొట్లాడేవారని దూషించడం తగదన్నారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకూడదని పేర్కొన్నారు.








