బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అడ్డుకునేందుకు వైసీపీ కుట్ర : మంత్రి నిమ్మల
తెలుగుదేశం పార్టీతోనే బడుగు, బలహీనవర్గాలకు రాజకీయ స్వాతంత్య్రమని మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా (West Godavari District) పాలకొల్లు పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో విద్యుత్ సౌకర్యాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తే, కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారని మండిపడ్డారు. బీసీలు రాజకీయంగా ఎదగకూడదనే గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తోందని విమర్శించారు.రాజారెడ్డి (Raja Reddy) నుంచి జగన్ (Jagan) వరకు ఆ కుటుంబం బీసీలను అణగదొక్కుతోందని ఆరోపించారు.








