పార్టీ బతకాలని కాదు.. వ్యవస్థ బతకాలనేదే నా ఆలోచన : పవన్ కల్యాణ్
పోలవరం జిల్లాలో అడవి తల్లి బాట (Adavi Thalli Bata) 2.0 కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రారంభించారు. పోలవరం జిల్లా (Polavaram District) ఏర్పాటయ్యాక తొలిసారి వచ్చిన ఉప ముఖ్యమంత్రికి గిరిజనలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ గిరిజన గ్రామాలన్నింటికీ రోడ్లు (Roads) వేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. స్థానిక ఎన్నికల్లో కూటమికి ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. స్థానిక ఎన్నికల్లో బలం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తాం. పార్టీ బతకాలని కాదు, వ్యవస్థ బతకాలనేదే నా ఆలోచన. పొత్తు ప్రకారం జనసేన (Janasena) శ్రేణులు ఎన్నికల్లో పోటీ చేస్తాయి. స్థానికంగా బలంగా ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయి అని అన్నారు.








