విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు
విజయవాడ(Vijayawada) ఇంద్రకీలాద్రి (Indrakeeladri)పై దసరా శరన్నవరాత్రోత్సవాలు(Dasara Sharannavaratri Celebrations) ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు దుర్గమ్మ(Durgamma) బాలత్రిపురసుందరీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. తొలిరోజు తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకార పూజలు నిర్వహించారు. భక్తులను ఉదయం 8 గంటల నుంచి దర్శనాలకు అనుమతించారు. ఉదయం 4 గంటల నుంచే దుర్గమ్మ దర్శన భాగ్యం కల్పిస్తారు.రాత్రి వరకూ వరకూ దర్శనాలు కొనసాగుతాయి.








