వ్యక్తిగత హాజరు నిర్ణయం కోర్టులదే .. ప్రభుత్వానికి సంబంధం లేదు : మంత్రి కొల్లు
వాస్తవాలను పక్కదారి పట్టించి రాజకీయ లబ్ధి పొందడమే జగన్ (Jagan) నీతి అని మంత్రి కొల్లు రవీంద్ర ( Kollu Ravindra) ఆక్షేపించారు. జగన్పై ఉన్న ఆర్థిక నేరాల కేసుల నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. షెల్ కంపెనీల (Shell companies) ద్వారా నిధుల మళ్లింపుపై విచారణ వేగవంతం కావాల్సి అవసరం ఉందన్నారు. 4 వేలకు పైగా డిశ్చార్జ్ పిటిషన్లతో విచారణలో కాలయాపన జరుగుతోంది. సీబీఐ కేసులు ( CBI cases) ఉన్నంత మాత్రాన ఈడీ (ED) విచారణ ఆగదు. ఈడీ విచారణకు రాజకీయ రంగులు పులమడం సరికాదు. డబ్బుంటే కేసులు మాఫీ చేసుకోవచ్చా? విచారణ సాగదీయొచ్చా? వ్యక్తిగత హాజరుపై నిర్ణయం కోర్టులదే. ప్రభుత్వానికి సంబంధం లేదు. ఆర్థిక నేరాల కేసుల విచారణ వేగవంతం చేసి ప్రజలకు నిజాలు వెల్లడించాలి. ఆలస్యమైనా తప్పు చేసినవారు చట్టం నుంచి తప్పించుకోలేరు అని అన్నారు.








