శ్రీవారి భక్తులకు శుభవార్త .. అందుబాటులోకి వేంకట్రాది యాప్
శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూపొందించిన వేంకటాద్రి యాప్ (Venkatadri App) అందుబాటులోకి వచ్చింది. యాప్ను ఆండ్రాయిడ్ యజర్లు గూగుల్ ప్లేస్టోర్ (Google Play Store) నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. యాపిల్ (Apple) యూజర్లకు త్వరలో ఇది అందబాటులోకి రానుంది. ఈ యాప్ ద్వారా భక్తులు ఆన్లైన్, ఆఫ్లైన్, జీపీఎస్ విధానంలో తిరుమల (Tirumala)లో మ్యాప్ చేసిన వందకు పైగా ప్రదేశాలకు చేరుకోవచ్చు. వర్చువల్ మ్యాన్ అందుకు సహాయపడుతుంది. ఇంటర్నెట్ (Internet) లేకపోయినా, ఇది పనిచేస్తుంది. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో వివిధ రోజుల్లో జరిగే వాహన సేవల సమాచారాన్నీ ఇందులో అందుబాటులో ఉంచారు.








