ఢిల్లీ వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలు
ఎన్నికల ప్రధాన కమిషనరు (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఏఐసీసీ నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమాలలో పాల్గొనేందుకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud)తోపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రులు (Ministers), ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి తరలివెళ్లారు. ఆదివారం సాయంత్రం మొత్తం 60 మంది నేతలతో తాను బయలుదేరి వెళినట్లు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కూడా ఆదివారం గోవా సభకు వెళ్లి, సోమవారం ఢిల్లీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.








