నిబంధనలు మార్చి జ్ఞానేశ్‌కుమార్‌ను తెచ్చారు : చామల కిరణ్‌కుమార్ రెడ్డి
దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద రాష్ట్ర కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. సుప్రీంకోర్టు(Supreme Court) వరకు ర్యాలీకి బయలుదేరేముందు తెలంగాణ భవన్ వద్ద చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ (CEC Gyanesh Kumar) నియామకం లోనే నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి (Chamala Kiran Kumar Reddy) ఆరోపించారు. నిబంధనలు మార్చి జ్ఞానేశ్‌కుమార్‌ను తెచ్చారని విమర్శించారు. సీఈసీ ( CEC)ని నియమించే కమిటీలో సీజేఐని తప్పించి, కేంద్ర మంత్రిని పెట్టుకున్నారని పేర్కొన్నారు. ఎంపిక కమిటీలో ఇష్టానుసారం మార్పలు చేశారన్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు సుప్రీంకోర్టు వరకు ఇండీ కూటమి నేతలు ర్యాలీ చేపట్టనున్నారు.








