ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ పెడ్లర్ల అడ్డాగా మార్చారు : సీఎం రేవంత్ రెడ్డి
గోవాలోని భూములు అన్యాక్రాంతమవుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. గోవాలో గోయ్ రాఖోన్న్ యాత్రలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీతో ఇక్కడి ప్రజలు విసిగిపోయారని తెలిపారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ (Pramod Sawant) కాదు, ప్రాపర్టీ సావంత్ అంటున్నారని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో నిరసనల వల్ల రాహుల్ గాంధీ (Rahul Gandhi) రాలేకపోయారని, ఆయన ప్రతినిధిగా ఇక్కడికి వచ్చానని తెలిపారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ( CEC Gyanesh Kumar) పేరుతో ప్రధాని మోదీ (Modi), పేదల ఓట్లను తొలగిస్తున్నారని విమర్శించారు. పేదలు, దళితులు, మైనారిటీలు, ఆదివాసీల ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. గోవా యువతను డ్రగ్స్‌కు బానిసలుగా మార్చారు. ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ పెడ్లర్ల అడ్డాగా మార్చారు. రెండుసార్లు గోవా ప్రజలు మోసపోయారు. మూడోసారి బీజేపీని నమ్మి గోవా ప్రజలు మోసపోవద్దు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది అని అన్నారు.








