వర్జీనియాలోని వేంకటేశ్వర లోటస్ టెంపుల్ లో ఘనంగా ప్రారంభమైన శరన్నవరాత్రులు
వర్జీనియాలోని ఫేయిర్ ఫాక్స్ లో వున్న శ్రీ వేంకటేశ్వర లోటస్ టెంపుల్ లో ఘనంగా దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. శరన్నవరాత్రుల్లో మొదటి రోజులో భాగంగా ఆది లక్ష్మీ రూపంలో కొలిచారు., ఈ సందర్భంగా అమ్మ వారికి నారింజ రంగులో వున్న వస్త్రాన్ని ధరింపజేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అర్చాదికాలు జరిగాయి.
అలాగే సాయంత్రం లలితా సహస్ర నామ పారాయణం, సంగీత, నృత్య సేవ, శ్రీ ఆది లక్ష్మీ సహస్రనామ అర్చన, చివరికి ప్రసాద వితరణ జరిగింది. అంతేకాకుండా ఈ నెల 11 వ తేదీన అర్చకులు సుదర్శన హోమాన్ని కూడా నిర్వహించారు.
ఈ నవ రాత్రుల్లో భాగంగా ప్రతి రోజూ సాయంత్రం 6:30 గంటలకు లలితా సహస్ర పారాయణం, 7:00 గంటలకు సంగీత, నృత్య సేవా, దాని తర్వాత శ్రీ లక్ష్మీ సహస్ర నామ అర్చన జరుగుతుంది.
మొదటి రోజున ఆది లక్ష్మీ అమ్మవారి రూపం – ఆరెంజ్ రంగు చీర
రెండో రోజు : ధాన్యలక్ష్మీ – వైట్ చీర
మూడో రోజు : ధైర్య లక్ష్మీ – రెడ్ సారీ
నాలుగో రోజు : గజ లక్ష్మీ – రాయల్ బ్లూ సారీ
ఐదో రోజు : సంతాన లక్ష్మీ – యెల్లో సారీ
ఆరో రోజు : ధన లక్ష్మీ – గ్రీన్ సారీ
ఏడో రోజు – మహాలక్ష్మీ – గ్రే శారీ
ఎనిమిదో రోజు – వీర్య లక్ష్మీ – పర్పుల్ శారీ
తొమ్మిదో రోజు – సరస్వతీ పూజ – పీకాక్ గ్రీన్
ఈ సందర్భంగా తొమ్మిది రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో భక్తులంతా పాల్గొనాలని ట్రస్ట్ సభ్యులు పిలుపునిస్తారు.








