డిజిటల్ రైట్స్ తోనే భారీ లాభాల్లోకి ఆకాశంలో ఒక తార!
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్(Dulquer salman)కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఆయన నటించే సినిమాలపై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో దుల్కర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఆకాశంలో ఒక తార(Aakasam lo oka tara) సినిమా రిలీజ్ కు ముందే భారీ బిజినెస్‌తో వార్తల్లో నిలుస్తోంది. నవంబర్ 20న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు డిజిటల్ రైట్స్ రూపంలో ఏకంగా రూ.60 కోట్ల ఆదాయం వచ్చినట్లు సమాచారం. అన్ని భాషలకు కలిపి ఈ స్థాయిలో డిజిటల్ డీల్ కుదరడం సినిమాపై నెలకొన్న అంచనాలను తెలియజేస్తోంది.
స్వప్న సినిమా(Swapna cinema), గీతా ఆర్ట్స్(Geetha arts) వంటి ప్రముఖ నిర్మాణ సంస్థల మద్దతుతో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. డిజిటల్ రైట్స్ అమ్మకం ద్వారా చిత్ర నిర్మాణానికి పెట్టిన పెట్టుబడి మొత్తం తిరిగి వచ్చిందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే థియేటర్లలో సినిమా సాధించే కలెక్షన్లు నిర్మాతలకు అదనపు లాభాలను అందించే అవకాశం ఉంది. రీసెంట్ గా రిలీజైన టీజర్ కూడా ఆడియన్స్ లో ఆసక్తిని పెంచింది. కథాంశం, మేకింగ్‌తో ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
పవన్ సాదినేని(Pavan sadhineni) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాత్విక వీరవల్లి హీరోయిన్ గా నటిస్తోంది. సందీప్ గున్నం(Sandeep gunnam), రమ్య గున్నం(Ramya Gunnam) నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు దుల్కర్ సల్మాన్ శ్రీశ్రీ(Sri Sri) సినిమా షూటింగ్‌ను కూడా పూర్తి చేశారు. ఈ సినిమా డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా వరుస సినిమాలతో తెలుగు ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధమవుతున్న దుల్కర్‌కు ఆకాశంలో ఒక తార ఎలాంటి సక్సెస్‌ను అందిస్తుందో చూడాలి.








