జైలర్2లో బాలయ్య నటించకపోవడం సరైన నిర్ణయమేనా?
సూపర్‌స్టార్ రజినీకాంత్(rajinikanth) నటించిన జైలర్2(Jailer2) బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్‌ను అందుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ గురించి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మొదలైంది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ (Nandamuri balakrishna) ఈ సినిమాలో నటించే ఛాన్స్ ను రిజెక్ట్ చేశారనే వార్తలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్(Nelson Dileep kumar) ఈ క్యారెక్టర్ కోసం బాలయ్యను మూడు సార్లు సంప్రదించినప్పటికీ, ఆయన ఇంట్రెస్ట్ చూపలేదని ప్రచారం జరుగుతోంది. సినిమా సక్సెస్ ను చూసిన కొందరు ఫ్యాన్స్ బాలకృష్ణ మంచి ఛాన్స్ ను వదులుకున్నారా? అంటూ డిస్కస్ చేసుకుంటున్నారు.
జైలర్2లో శివరాజ్‌కుమార్(Sivaraj kumar), మోహన్‌లాల్(mohanlal), జాకీ ష్రాఫ్(Jockey shroff), హృతిక్ రోషన్(Hrithik roshan), విజయ్ సేతుపతి(Vijay sethupathi) వంటి ప్రముఖ నటులు గెస్ట్ రోల్స్ లో కనిపించారు. అయితే వీరిలో శివరాజ్‌కుమార్ క్యారెక్టర్ కు మాత్రమే కథలో చెప్పుకోదగ్గ ప్రాధాన్యం లభించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మిగతా నటుల స్క్రీన్ ప్రెజెన్స్ లిమిటెడ్ గా ఉండటంతో, ఇంతటి స్టార్డమ్ ఉన్న నటులు ఇలాంటి చిన్న క్యారెక్టర్లను ఎందుకు ఒప్పుకున్నారనే ప్రశ్నలు కూడా వినిపించాయి. విజయ్ సేతుపతి పాత్ర నిడివి విషయంలోనూ చర్చ జరిగింది.
ఈ పరిణామాలను పరిశీలిస్తే బాలకృష్ణ జైలర్2లో నటించకపోవడం ఆయనకు కలిసొచ్చిన అంశంగానే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఈ సినిమాలో కనిపించి ఉంటే, రన్ టైమ్ తక్కువగా ఉన్నా లేదా ప్రాధాన్యం తగ్గినా సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉండేది. అయితే బాలకృష్ణ ఈ క్యారెక్టర్ ను రిజెక్ట్ చేయడానికి గల అసలు కారణాలపై అఫీషియల్ క్లారిటీ లేదు. నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్(Sun pictures) నిర్మించిన ఈ సినిమా సక్సెస్ సాధిస్తున్నా, గెస్ట్ రోల్స్ విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.








