నాలుగు సినిమాలతో అనిల్ సుంకర కంబ్యాక్ ప్లాన్!
టాలీవుడ్లో నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనిల్ సుంకర(anil sunkara).. వరుస ఫ్లాపుల తర్వాత మళ్లీ సక్సెస్ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. చిరంజీవి(chiranjeevi) హీరోగా తెరకెక్కిన భోళా శంకర్(Bhola shankar), అఖిల్(Akhil) నటించిన ఏజెంట్(Agent) సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోకపోవడంతో ఆయనకు భారీ ఆర్థిక నష్టాలు ఎదురయ్యాయి. ఈ పరిణామాల నుంచి కోలుకునేందుకు కొంతకాలం గ్యాప్ తీసుకున్న అనిల్ సుంకర.. ఇప్పుడు కొత్త ప్రాజెక్టులతో బిజీ అవుతున్నారు. ఒకేసారి నాలుగు సినిమాలను లైన్లో పెట్టి, వచ్చే ఏడాదిని తన కెరీర్లో కీలకమైనదిగా మార్చుకోవాలని భావిస్తున్నారు.
ఈ నిర్మాత నిర్మాణంలో శర్వానంద్(Sharwanand) హీరోగా శ్రీను వైట్ల(Srinu vaitla) దర్శకత్వం వహిస్తున్న జార్జ్ క్రిష్(George krish) ఇప్పటికే సెట్స్‌పై ఉంది. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు సాయిధరమ్ తేజ్(Sai dharam tej)తో ఓ సినిమాను అనిల్ సుంకర అనౌన్స్ చేశారు. తేజ(Teja) దర్శకత్వం వహించనున్న ఈ సినిమా నవంబర్‌లో మొదలు కానుండగా, 2027 సమ్మర్ లో రిలీజయ్యే ఛాన్సుంది. దీంతో ఈ రెండు ప్రాజెక్టులు ఆయన కంబ్యాక్ ప్లానింగ్ లో కీలకంగా మారనున్నాయి.
ఇక వైష్ణవ్ తేజ్(vaishnav tej)తో మరో సినిమాను నిర్మించేందుకు అనిల్ సుంకర సిద్ధమయ్యారు. మహేష్ ఎస్(mahesh S) దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కొంతకాలంగా జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. వీటితో పాటు మంచు మనోజ్(manchu manoj) ప్రధాన పాత్రలో నటిస్తున్న వడ్డీ కాసులవాడ(Vaddi kasulavada) సినిమాను కూడా ఆయన నిర్మిస్తున్నారు. తేజ్ ఉప్పలపాటి(Tej uppalapati) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ఈ నాలుగు సినిమాలూ 2027లో రిలీజయ్యేలా పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారు. మరి ఈ సినిమాలు అనిల్ సుంకరకు ఎలాంటి సక్సెస్‌లను అందిస్తాయో చూడాలి.








