సుప్రీంకోర్టు ఆదేశాలపై వైసీపీది తప్పుడు ప్రచారం : టీడీపీ
మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) నామినేషన్ల అంశంలో సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన ఆదేశాలపై వైసీపీ (YSRCP)ది తప్పుడు ప్రచారమని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పేర్కొంది. 19 చోట్ల నామినేషన్ల గడువు పొడిగించినట్లు వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించింది. ఆయా చోట్ల ఫిర్యాదులను పున పరిశీలించాలని సుప్రీంకోర్టు చెప్పిందని తెలిపింది. మళ్లీ నామినేషన్ల స్వీకరణపై నిర్ణయాధికారం ఎస్ ఈసీ (SEC) కే ఇచ్చినట్లు పేర్కొంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు అభ్యంతరాలు చెప్పలేదని టీడీపీ (TDP) తెలిపింది.








