సమిష్టి కృషితో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం : టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు సమిష్టి కృషితో విజయవంతం అయ్యాయని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. భక్తులకు వాహనసేవలతో పాటు మూలమూర్తి దర్శించుకున్నారన్నారు. అంతేకాదు గరుడసేవకు భారీ వర్షంలోనూ విశేష ఏర్పాట్లు చేశామన్నారు. బ్రహ్మోత్సవాలలో 6.46 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శించుకోగా.. రూ.25.79 కోట్ల హుండీ కానుకలుగా వచ్చాయి. బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, భక్తులకు అందించిన సేవలను వివరించారు.
అక్టోబరు 12 నుంచి 20వ తేదీ వరకు జరిగిన బ్రహ్మోత్సవాల్లో దేశవిదేశాల నుంచి విచ్చేసిన భక్తులకు వాహనసేవలతో పాటు శ్రీవారి మూలమూర్తి దర్శనం కల్పించామని చెప్పారు. గరుడసేవ రోజున ఉదయం నుంచి భారీ వర్షం కురిసినా భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారి సేవను వీక్షించారని, వారికి అల్పాహారం, అన్నప్రసాదాలు, బాదం పాలు, సుండలు, జ్యూస్, బిస్కెట్లు అందించామని తెలిపారు.తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించామని.. దేశవిదేశాల నుంచి విచ్చేసిన భక్తులకు వాహనసేవలతో పాటు శ్రీవారి మూలమూర్తి దర్శనం కల్పించామన్నారు. గరుడసేవ రోజున ఉదయం నుంచి భారీ వర్షం కురిసినా భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారి సేవను వీక్షించారని తెలిపారు. భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, బాదం పాలు, సుండలు, జ్యూస్, బిస్కెట్లు అందించామన్నారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిది రోజుల్లో 6.46 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శించుకున్నారు. ఈ ఎనిమిది రోజుల్లో రూ.25.79 కోట్ల హుండీ కానుకలు వచ్చాయి. అలాగే తిరుమలలో 22.60 లక్షల అన్నప్రసాదాల పంపిణీ చేయగా.. 2.44 లక్షల మంది భక్తుల తలనీలాల సమర్పించారు. 34.34 లక్షల లడ్డూల విక్రయించారు.
వాహనసేవలకు ముందు 26 రాష్ట్రాలు మరియు ఖతర్, దుబాయ్ నుంచి వచ్చిన 252 కళాబృందాలకు చెందిన సుమారు 6,777 మంది కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శించారు. గరుడసేవ రోజున 17 రాష్ట్రాల నుంచి 31 కళాబృందాలకు చెందిన 863 మంది కళాకారులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శనలిచ్చిన కళాబృందాలను ప్రతిరోజూ టీటీడీ ఈవో సన్మానించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా సుమారు 60 టన్నుల పుష్పాలు, 5 లక్షల కట్ఫ్లవర్స్, 80 వేల సీజనల్ పుష్పాలతో అలంకరణలు చేపట్టారు. తిరుమల, తిరుపతిలో విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేయడంతో పాటు వాహనసేవల వీక్షణకు 36 భారీ డిజిటల్ స్క్రీన్లు అందుబాటులో ఉంచారు. ప్రపంచవ్యాప్తంగా భక్తులు బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల్లో 2,800 మంది పోలీసులు, 2,000 మంది విజిలెన్స్ సిబ్బంది విధులు నిర్వహించగా, గరుడసేవ రోజున అదనంగా 1,000 మంది పోలీసులను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. గరుడసేవ రోజున 3,500 మంది పారిశుద్ధ్య సిబ్బంది సేవలందించారు. సేకరించిన సుమారు 183 టన్నుల తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలించారు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల విజయవంతానికి సహకరించిన అర్చక స్వాములు, పాలకమండలి సభ్యులు, అధికారులు, ఉద్యోగులు, జిల్లా, పోలీసు యంత్రాంగాలు, శ్రీవారి సేవకులు, వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది, భక్తులకు ఛైర్మన్ బీఆర్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
బ్రహ్మోత్సవాల వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా భక్తులకు చేరవేసిన మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.








