శరన్నవరాత్రుల వేళ స్వరభారతి నాదనీరాజనం
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అక్టోబర్ 17న హ్యూస్టన్లోని స్థానిక శృంగేరి విద్యాభారతి ఫౌండేషన్ (SVBF) ఆలయంలో నిర్వహించిన నాదనీరాజన కార్యక్రమాలకు స్వరభారతి బృందం సంగీత సేవ మధురమైన ముగింపునిచ్చింది.
శ్రీమతి శ్రీదేవి జోస్యుల గారి ప్రధాన గాత్రంలో స్వరభారతి బృందం భక్తిరసభరితమైన సంకీర్తనలతో అమ్మవారికి స్వరనీరాజనం సమర్పించింది.
గణేశ పంచరత్నంతో ప్రారంభమైన ఈ సంగీత కార్యక్రమంలో శంకర పూజితే శారదే, అంబా భవాని, భాగ్యద లక్ష్మీ బారమ్మ వంటి సంకీర్తనలు ఆలపించి, చివరగా నాద బిందు కళాది నమో నమః కీర్తనతో మంగళప్రదంగా ముగించారు.
వివిధ రాగాల మేళవింపుతో సాగిన ఈ సంగీతార్చన ఆద్యంతం భక్తిపారవశ్యాన్ని నింపింది. గాత్రం, వీణ, వయోలిన్, మృదంగ నాదాల సమ్మేళనం ఆలయ ప్రాంగణాన్ని సంగీతమయం చేయగా, శ్రోతలంతా ఆ నాదామృతంలో మునిగితేలారు.

స్వరభారతి గాయక బృందం:
శ్రీదేవి జోస్యుల, అనికా భట్, అన్వీ భట్, చిన్మయి కొండూరు, శైలజ చుండూరు, హేమ నళిని తల్లావఝుల, అనుకృతి వెనుకదాసుల, చైత్ర భట్, మేఘన కర్ర, మాధవీలత తుంగా, శ్రీలక్ష్మి, సుమా సురేష్, బిందు పొన్నపల్లి, సుధా సాంబరాజు, అర్పణ పైడిశెట్టి, వాణి దిట్టకవి, రుక్మిణి చీరాల, లలిత రాచకొండ, శిరీష పిల్లలమర్రి, మల్లిక కామన, రాజేశ్వరి ప్రభల, పద్మిని భట్, సూర్యకుమారి, గీత రావు.
వాద్య సహకారం:
• వయోలిన్: ముకుంద్ జోస్యుల
• మృదంగం: విశాల్ సెట్లూర్
• వీణ: నీరజా సెట్లూర్
శరన్నవరాత్రుల పవిత్ర వాతావరణంలో స్వరభారతి సమర్పించిన ఈ నాదనీరాజనం సంగీతానికీ, భక్తికీ అందమైన సంగమంగా నిలిచింది.
– హేమ నళిని తల్లావఝుల








