రామచంద్రపురంలో “చెప్పాం! చేస్తున్నాం..” పోస్టర్ ఆవిష్కరణ..
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రామచంద్రపురంలో “చెప్పాం! చేస్తున్నాం!!” ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆవిష్కరించారు.
హామీలు నెరవేరుస్తున్నాం..
పోస్టర్ ఆవిష్కరణ అనంతరం ఎంపీ సానా సతీష్ బాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను వరుసగా నెరవేరుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమానికి, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తూ పాలన అందిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సుపరిపాలన అందించడమే తమ లక్ష్యమని తెలిపారు.

ప్రతి ఇంటికీ ప్రచార ప్రణాళిక..
అక్టోబర్ 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు నిర్వహించే ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రణాళికాబద్ధంగా ప్రతి ఇంటికీ వెళ్లనున్నారు. ప్రభుత్వ పాలనా ఫలితాలు, ప్రవేశపెట్టిన పథకాలు, భవిష్యత్ లక్ష్యాలను ప్రజలకు ప్రత్యక్షంగా వివరించనున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న తమ ప్రభుత్వ పనితీరును ప్రతీ కుటుంబానికి తెలియజేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు.
ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో అమలాపురం లోక్సభ సభ్యులు గంటి హరీష్ బాలయోగి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్లతో పాటు పలువురు కూటమి ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.








