అందుకే స్థానిక ఎన్నికలకు ప్రాధాన్యత ఉంటుంది : సీఎం చంద్రబాబు
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం..
మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…
• స్థానిక ఎన్నికలతో స్థానిక నాయకత్వం బలపడుతుంది.
• అందుకే స్థానిక ఎన్నికలకు ప్రాధాన్యత ఉంటుంది.
• 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు చరిత్ర సృష్టిస్తూ అద్భుతమైన తీర్పు ఇచ్చారు.
• 94 శాతం స్ట్రైక్ రేట్… 57 శాతం ఓట్ షేర్‌తో గెలిచాం.
• దేశంలో మరెక్కడా ఈ స్థాయిలో ఫలితాలు రాలేదు.
• నాటి ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు అది.
• ప్రధాని మోదీ నాయకత్వంలో నేను, పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని పునర్ నిర్మిస్తామని హామీ ఇచ్చాం.
• నాడు ఇచ్చిన హామీలను అమలు చేసేలా పాలన అందిస్తున్నాం.
• సంక్షేమం-అభివృద్ధి-సుపరిపాలనతో పరిపాలన చేపడుతున్నాం.
• అనేక సవాళ్లున్నా చెప్పిన హామీలను నెరవేర్చాం… సంక్షేమాన్ని అందించాం.
• ప్రతి ఒక్క వ్యక్తికి భద్రత-కుటుంబానికి సాధికారత-గ్రామాలు, పట్టణాల అభివృద్ధి వంటివి చేపట్టాం.
• ఎక్కువ మొత్తంలో సామాజిక భద్రత పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.. ఇది అతి పెద్ద డీబీటీ ప్రోగ్రాం.
• ఎంత మంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చాం.
• అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి, దీపం-2.0 వంటి పథకాలను అందిస్తున్నాం.
• ఇవే కాకుండా వివిధ రకాల వర్గాలకు మేలు చేసే పథకాలు అమలు చేస్తున్నాం.
• డేటా సెంటర్ల నుంచి డిఫెన్స్ ప్రాజెక్టుల వరకూ అన్ని పరిశ్రమలను తెస్తున్నాం.
• రెండున్నరేళ్లల్లో భారీ ఎత్తున పెట్టుబడులు తెచ్చేలా కృషి చేశాం… ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తున్నాం.
• ప్రభుత్వ పథకాల సేవలు ప్రజలకు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటున్నాం.
• గతంలో తీసుకున్న నీటి భద్రత చర్యలతో ఎల్ నినో సమస్యను తట్టుకోగలుగుతున్నాం.
• మేం రోడ్లు వేస్తుంటే… భరించ లేక ఆ రోడ్లను కూడా ట్రాక్టర్లతో తవ్వేశారు. ఇది దారుణం.
• డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు ఇస్తుంటే… కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారు.
• అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాం… అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నాం.
• సీమలో గ్లోబల్ హార్టీకల్చర్ హబ్ పేరుతో ఉద్యాన పంటలను అభివృద్ధి చేస్తున్నాం.
• రాయలసీమ ఫ్యాక్షనిజం అనేది సినిమాలకు కంటెంటుగా మారింది.
• ఇప్పుడు సీమలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అసూయ పడే పరిస్థితి వచ్చింది.
• రాయలసీమను అభివృద్ధికి నమూనాగా మారుస్తున్నాం.
• ఉత్తరాంధ్ర అభివృద్ధికి రెక్కల పేరుతో అభివృద్ధి చేస్తున్నాం.
• వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీరందించాం.. 30 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేశాం.. మళ్లీ మేమే ప్రారంభించాం.
• పోలవరాన్ని నాశనం చేశారు.. ఢయాఫ్రం వాల్‌ను గోదాట్లో ముంచేశారు.
• ఇప్పుడు అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో పోలవరం నిర్మాణం చేపడుతున్నాం.
• పోలవరం నిర్మాణం పూర్తి చేయడమే కాదు… ఆర్ అండ్ ఆర్ కూడా అందిస్తున్నాం.
• గోదావరి-కావేరి అనుసంధానమైతే దక్షిణాది రాష్ట్రాల మధ్య నీటి కోసం యుద్దాలు తప్పుతాయి.
• అమరావతిని నిర్వీర్యం చేశారు. భూములిచ్చిన రైతుల త్యాగాన్ని అపహాస్యం చేసేలా చేశారు.
• ప్రపంచం మెచ్చే రాజధానిగా అమరావతిని పునర్నిర్మిస్తున్నాం.
• 2029 లోపు 36 ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు పూర్తి చేస్తాం.
• గోదావరి, కృష్ణా పుష్కరాలకు ఏర్పాట్లు చేస్తున్నాం.
• విజయవాడ ఎయిర్ పోర్టు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.. న్యూ టెర్మినల్ బిల్డింగ్ ప్రారంభిస్తాం.
• విశాఖ, తిరుపతి, అమరావతి ఎకనమిక్ రీజియన్లగా అభివృద్ధి చేస్తున్నాం.
• నియోజకవర్గానికో ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నాం
• స్వయం పేరుతో డ్వాక్రా ఉత్పత్తుల మార్కెటింగ్ చేపడుతున్నాం.
• పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50 లక్షల కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు.
• కేంద్రం, రాష్ట్రం, స్థానిక ప్రభుత్వాలు చాలా కీలకం.. ఇవన్నీ ఒక్కతాటి మీద ఉంటే రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది.
• గత ప్రభుత్వం కేంద్ర నిధులను పక్కన పెట్టేసింది… జేజేఏం పనులను చేపట్టలేదు.
• ఆర్థిక సంఘం నిధులను స్థానిక సంస్థలకు ఇవ్వకుండా గత ప్రభుత్వం అడ్డుకుంది.
• గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోయింది… దీని వల్ల భూగర్భ జలాలు కలుషితమయ్యాయి.
• గత పాలనలో పేరుకుపోయిన చెత్తను క్లియర్ చేయడానికి రెండున్నరేళ్లు పట్టింది.
• గ్రామాలను.. పట్టణాలను స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తున్నాం.
• ఇళ్ల పైనే సోలార్ ప్యానెళ్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తికి అవకాశం కల్పిస్తున్నాం.
• విశాఖ, విజయవాడల్లో సంపూర్ణ హక్కులు కల్పిస్తూ ఇళ్ల పట్టాలు ఇచ్చాం.
• రాజముద్రతో పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇస్తున్నాం.
• గత ప్రభుత్వంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌తో భూములను దోపిడీ చేయాలనుకున్నారు.
• ప్రజల ఆస్తులపై.. పట్టాదార్ పాస్ పుస్తకాలపై నాటి గత సీఎం తన బొమ్మలేసుకున్నారు.
గతంలో దేవాలయాలను అపవిత్రం చేశారు… ప్రసాదాన్ని కల్తీ పదార్ధాలతో తయారు చేయించారు.
• ప్రస్తుతం ఏ దేవాలయానికి వెళ్లినా పవిత్ర వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
• కేంద్ర సహకారం ఉంది.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం… స్థానిక సంస్థల్లో కూడా ఒకే ప్రభుత్వం ఉండాలి.
• మూడు స్థాయిల్లోనూ ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి ఆగదు… మరింత స్పీడుగా వెళ్లడానికి ఆస్కారం ఉంటుంది.
• కూటమి అభ్యర్థులను గెలిపించండి… అభివృద్ధి సహకరించండి.
• ప్రజలు మెచ్చిన వాళ్లనే అభ్యర్థుల ఎంపిక చేసేలా కసరత్తు చేశాం.
• పార్టీకి సేవలందించిన వారిని… సోషల్ రీ-ఇంజనీరింగ్ ప్రకారం అభ్యర్థుల ఎంపిక చేశాం.
• బీసీలు, యువత, మహిళకు ప్రాధాన్యమిచ్చాం… విద్యావంతులను అభ్యర్థులుగా నిలబెట్టాం.
• ఈసారి పట్టణ స్థానిక ఎన్నికల్లో మేయర్లు, ఛైర్ పర్సన్లను నేరుగా ఎన్నుకునే విధానం తెచ్చాం.
• ఆయారాం.. గయారాంల సంస్కృతికి చెల్లుచిటీ పలికాం.. స్వచ్ఛ రాజకీయాలకు పునాది వేశాం.
• ఒక్కో మేయర్ స్థానాన్ని ఒక్కో సామాజిక వర్గానికి ఇచ్చాం.
• మేయర్-మున్సిపల్ ఛైర్ పర్సన్ స్థానాల్లోనూ యువత, విద్యాధికులకు ఇచ్చాం.
• సోషల్ రీ-ఇంజనీరింగ్ కు అధిక ప్రాధాన్యమిచ్చాం.. బీసీలకు మరింత పెద్ద పీట వేశాం.
• బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 63.6 శాతం మేర సీట్లు ఇచ్చాం. ఒక్క బీసీలకే 35 శాతానికి పైగా ఇచ్చాం.
• గంజాయి బ్యాచ్ వర్సెస్ విద్యావంతులు అన్నట్టుగా స్థానిక ఎన్నికల్లో పోటీ నెలకొంది.








