‘సెంట్రల్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్’ వేదికగా ఆటా ‘‘వాలెంటీర్ కార్యక్రమం’’
అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే అమెరికా తెలుగు సంఘం (ATA – ఆటా) ఆస్టిన్ విభాగం మరో విశిష్ట సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్థానిక సమాజానికి చేయూతనందించే లక్ష్యంతో ‘సెంట్రల్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్’ వేదికగా ఒక వాలంటీర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆటా ప్రతినిధులు తెలిపారు.
కార్యక్రమ వివరాలు:
తేదీ: శనివారం, అక్టోబర్ 31, 2026 సమయం: ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు వేదిక: 6500 Metropolis Drive, Austin, TX 78744
సేవా కార్యక్రమ విశేషాలు:సెంట్రల్ టెక్సాస్ వ్యాప్తంగా ఉన్న పేద, నిరుపేద కుటుంబాలకు సాయం అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగా వాలంటీర్లు ఆహార పదార్థాలు మరియు ఇతర నిత్యావసర వస్తువులను పరిశీలించడం, వర్గీకరించడం మరియు ప్యాకింగ్ చేయడం వంటి పనులలో పాల్గొంటారు.
రిజిస్ట్రేషన్ మరియు పాల్గొనే విధానం:
తెలుగు వారందరూ ఈ మంచి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆటా ఆస్టిన్ బృందం పిలుపునిచ్చింది. ఆసక్తి గలవారు ఇవ్వబడిన లింక్ (https://cafb.volunteerhub.com/vv2/lp/americateluguassoc) లేదా పోస్టర్లోని QR కోడ్ను స్కాన్ చేయడం ద్వారా ముందుగానే తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.
ఈ కార్యక్రమాన్ని ఆటా ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షులు జయంత్ చల్లా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రామసహాయం రెడ్డి, సెక్రటరీ సాయినాథ్ బోయపల్లి, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి మరియు ఆస్టిన్ టీమ్ సభ్యులు (సంగమేశ్వర్ రెడ్డి, రాజ్ సింగిరెడ్డి, లక్ష్మణ్ కపర్తి తదితరులు) కలిసి పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని వివరాలకు నర్సిరెడ్డి గడ్డికొప్పుల (512-670-6083) గారిని సంప్రదించవచ్చని ఆటా ప్రతినిధులు తెలిపారు.








