భారీ వర్షంలోనూ బతుకమ్మ సంబరాలు.. వైభవంగా TTA బతుకమ్మ సెలబ్రేషన్స్
తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ పండుగను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) అమెరికా వ్యాప్తంగా వైభవంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఫోర్డ్స్ లోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ గ్రాండ్ బ్యాంకెట్ హాలులో జరిగిన ఈ వేడకకు 3,00 మందికి పైగా తెలుగు ప్రజలు హాజరయ్యారు. దీంతో న్యూజెర్సీకే తెలంగాణ తెలుగుదనం వచ్చేసింది.
తెలంగాణ మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ బతుకమ్మ సంబరాలు TTA స్థాపన నాటి నుంచి అమెరికాలో అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. TTA వ్యవస్థాపకులు డా. పైల్ల మల్లారెడ్డి ఆశీస్సులతో డా. విజయపాల్ రెడ్డి (అడ్వైజరీ చైర్), డా. మోహన్ రెడ్డి పటలోల్ల (అడ్వైజరీ కో చైర్), భరత్ రెడ్డి మాదడి (అడ్వైజరీ మెంబర్), నవీన్ మలిపెడ్డి (ప్రెసిడెంట్), వంశీరెడ్డి కంచర్లకుంట్ల (పాస్ట్ ప్రెసిడెంట్), శివారెడ్డి కొల్లా (జనరల్ సెక్రెటరీ) మార్గదర్శకత్వంలో ఈ సంవత్సరం అమెరికా వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు అత్యంత భారీ స్థాయిలో జరుగుతున్నాయి.

న్యూజెర్సీలో అద్భుతమైన వేడుక
అడ్వైజరీ కౌన్సిల్ కో చైర్ డా. మోహన్ పటలోల్ల స్వరాష్ట్రం న్యూజెర్సీలో జరిగిన ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శివారెడ్డి కొల్లా (సెక్రెటరీ TTA), నర్సింహ పెరుక (ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్), సుధాకర్ ఉప్పల (న్యూస్ లెటర్ డైరెక్టర్), అరుణ్ ఆర్కాల (BOD), నరేంద్ర యరవ (స్టాండింగ్ కమిటీ చైర్), శ్రీమతి దీపా జలగం (WOMESN TEAM LEAD) నాయకత్వంలో ఈ వేడక అత్యంత శ్రద్ధగా, సమన్వయంతో నిర్వహించారు. భారీ వర్షం పడుతున్నా, వేలాది మంది మహిళలు, పురుషులు, పిల్లలు సంప్రదాయ దుస్తుల్లో హాజరై, న్యూజెర్సీలో తెలంగాణ వాతావరణాన్ని తీసుకొచ్చారు.
TTA NJ RVPS ప్రశాంత్ నలుబందు, రాజా నీలం, అలాగే నిబద్ధతతో పనిచేసిన NJ కోర్ టీమ్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి మల్యా, శంకర రెడ్డి వులుపాల, నవీన్ కోలురు, శ్రీనివాస్ జక్కిరెడ్డి, అనేక మంది వాలెంటీర్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అహర్నిశలు కృషి చేశారు.

వేడుక ముఖ్యాంశాలు :
1. ఉదయం 11 గంటలకు 15 అడుగుల ఎత్తైన భారీ బతుకమ్మ ఆవిష్కరణతో వేడుకలు ప్రారంభం.
SDP పురోహితులు TTA కోర్ టీమ్ తో కలిసి గౌరీ పూజ నిర్వహించి, శుభారంభం చేశారు.
చిన్నారి శ్రీ ప్రవర్ధిని అమ్మవారి పాటతో కార్యక్రమాన్ని ఆరంభించింది.
తారికా, తన్విగా (తారా ఆర్ట్స్ అకాడమీ) బతుకమ్మ థీమ్ తో అద్భుతమైన నృత్య ప్రదర్శన ఇచ్చారు.
MC దీప్తి యాయవరం మహిళలను బతుకమ్మ చుట్టూ సంప్రదాయ పద్ధతిలో అడుగులు వేయడానికి ప్రోత్సహించారు.
న్యూజెర్సీ నలుమూలల ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు 100 కు పైగా అందమైన బతుకమ్మలు తీసుకొచ్చి తమ భక్తిని చాటుకున్నారు.
వేలాది మంది మహిళలు, పిల్లలు బతుమ్మల చుట్టూ నృత్యాలు చేస్తూ సృష్టించిన ఆ వాతావరణం మాటల్లో చెప్పలేం.
సంస్థల నాయకుల హాజరు
TFAS, TANA, ATA, NATS, MATA వంటి అనేక తెలుగు సంస్థల నాయకులు హాజరై తమ మద్దతు తెలిపారు.. శ్రీధర్ చిల్లర (CEO – ManaTV & TV5 USA), దాము గేదెల (కమ్యూనిటీ లీడర్), భాస్కర్ భూపతి (పాస్ట్ ప్రెసిడ్ంట్ – వాసవి సొసైటీ) వంటి స్థానిక నాయకులు కార్ాక్రమాన్ని అభినందించారు.. డా. మోహన్ పటలోల్ల మరియు సుధాకర్ ఉప్పల నాయకులను, ప్రముఖులను సభకు పరిచయం చేశారు.

బహుమతులు, స్పానర్లు, ముగింపు కార్యక్రమం
ఉత్తమ బతుకమ్మల బహుమతులను Joyalukas వ్యరు అందజేశారు.
ఉత్తమ్ దుస్తులు ధరించన మహిళల బహుమతులను Sunshine Collections మరియు Sai Creations స్పాన్సర్ చేశాయి.
బతుకమ్మ అలంకరణ కోసం అవసరమైన పూలను శ్రీ గణేష్ ఫ్లవర్ ఉారంగా అందజేశారు
• Vibrant Style Decors వారు Banquet Hall ను అందంగా అలంకరించారు.
* స్పాన్సర్లు, దాతలు, కళాకారులకు mementoes నాయకుల చేతుల మీదుగా అందజేశారు.
* నరేందర్ యరవ పర్యవేక్షణలో బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేసి కార్యక్రమానికి ముగింపు పలికారు.
* అతిథులకు రుచికరమైన భోజనం వడ్డించారు.
ఈ వేడుకలకు 15 అడుగుల బతుకమ్మ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నర్సింహ పెరుక భారతదేశంలోని లక్ష్మణ్ తో సమన్వయం చేసి, ఈ భారీ బతుకమ్మను తయారు చేయించి అమెరికాకు రవాణా చేయించారు.

. NJ కోర్ టీమ్ దీనిని సమకూర్చగా, యువత స్టాళ్ల ఏర్పాటులో సహకరించింది. మహిళలు తమ ఇష్టమైన దుస్తుు, ఆభరణాలు కొనుగోలు చేస్తూ షాపింగ్ ను ఆస్వాదించారు. ఈ వేడుకను విజయవంతం చేయడంలో సహకరించిన స్పాన్సర్లు, దాతలు, వాలంటీర్లందరికీ TTA హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తోంది..జోయాలుకాస్, ANG ఇన్ఫోటెక్, నిహి ఫుడ్స్, రావు నెట్ వర్క్, వాణి (వైబ్రంట్ స్టైల్ డెకోర్స్), శ్రీనివాస్ G (DJ జగ్గస్), ఆనంద్ చికినే (ఫోటోగ్రాఫర్) కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.








