ఫారిన్ వీధుల్లో యానిమల్ బ్యూటీ గ్లామర్ ట్రీట్
యానిమల్(Animal) మూవీతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్డమ్ దక్కించుకున్న త్రిప్తి డిమ్రీ(Tripti Dimri) ప్రస్తుతం స్పిరిట్(Spirit) లో ప్రభాస్(Prabhas) కు జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే. దాంతో పాటూ పలు సినిమాలతో బిజీగా ఉన్న త్రిప్తి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది.
అందులో భాగంగానే తాజాగా లాస్ ఏంజిల్స్ వీధుల్లో తిరుగుతూ ఉన్న ఫోటోలను షేర్ చేసింది త్రిప్తి. ఈ ఫోటోల్లో స్ట్రైప్డ్ ఓవర్ సైజ్డ్ టీ షర్ట్, వైడ్ లెగ్ డెనిమ్ జీన్స్, క్యాప్, స్నీకర్స్ తో సరికొత్త లుక్ తో మెరవగా, సింపుల్ అవుట్ఫిట్తో కూడా త్రిప్తి మంచి ట్రెండీ వైబ్ ను క్రియేట్ చేస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.








