మహేష్ డేట్పై ప్రభాస్ కన్ను?
టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొల్పిన ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli), మహేష్ బాబు(mahesh babu) సినిమా వారణాసి(varanasi) రిలీజ్ డేట్ పై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మొదలైంది. ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్స్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ప్రొడక్షన్ వర్క్స్, సినిమా స్థాయికి తగ్గట్టుగా చేపట్టాల్సిన సన్నాహాల నేపథ్యంలో అనుకున్న డేట్ కు రిలీజ్ సాధ్యమవుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభాస్(prabhas) నటిస్తున్న ఫౌజీ(Fauzi) సినిమాకు ఆ డేట్ దక్కొచ్చనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. అయితే, ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ మార్పుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ క్లారిటీ లేదు.
మరోవైపు ఆర్ఆర్ఆర్(RRR) తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి, తన నెక్ట్స్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే టార్గెట్ త ముందుకెళ్తున్నారు. ప్రియాంక చోప్రా(priyanka chopra), పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj sukumaran) వంటి ప్రముఖ నటులు భాగమైన వారణాసిని పలు విదేశీ మార్కెట్లలో పరిచయం చేసేందుకు స్పెషల్ స్ట్రాటజీలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, సినిమాపై అంతర్జాతీయ స్థాయిలో ఆశించినంత డిస్కషన్ ఇంకా మొదలుకాలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
సుమారు రూ.2,000 కోట్ల బ్రేక్ఈవెన్ టార్గెట్ తో ఈ సినిమా బరిలోకి దిగనుందనే ప్రచారం నేపథ్యంలో, ప్రమోషన్ల విషయంలో మేకర్స్కు కీలకమైన సవాళ్లు ఎదురుకానున్నాయి. విదేశీ మార్కెట్లపై దృష్టి సారిస్తూనే భారతీయ ప్రేక్షకుల్లోనూ అంచనాలను పెంచడం అవసరం. రిలీజ్ డేట్ పై క్లారిటీ, ప్రమోషన్స్, ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ను పెంచే కంటెంట్.. ఈ మూడు అంశాలు వారణాసి బాక్సాఫీస్ ప్రయాణంలో కీలక పాత్ర పోషించనున్నాయి.








