సీఎం చంద్రబాబు తో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ భేటీ
సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) తో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ (Mohan Yadav) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాజధాని అమరావతి ( Amaravati) నిర్మాణం సహా రాష్ట్రంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. సీఎం నివాసానికి వచ్చిన ఆయనకు మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) స్వాగతం పలికారు. యువగళం పాదయాత్ర పుస్తకాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కు మంత్రి నారా లోకేష్ అందజేశారు. తన పాదయాత్రకు సంబంధించిన అంశాలను మధ్యప్రదేశ్ సీఎం కు వివరించారు.









