స్లమ్‌డాగ్ పై పెరుగుతున్న ఆసక్తి.. త్వరలోనే రిలీజ్ డేట్‌పై క్లారిటీ!
విలక్షణమైన కథలను ఎంచుకుంటూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి (vijay sethupathi), ఇప్పుడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(puri jagannadh)తో కలిసి స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్(Slum dog:33 temple road) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. యాక్షన్, ఎమోషన్స్, ఉత్కంఠభరిత సీన్స్ తో రూపొందుతున్న ఈ సినిమాలో టబు(Tabu), సంయుక్త మీనన్(samyuktha menon), దునియా విజయ్(Dunia vijay), జరీనా వహాబ్(Zareena wahab) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ మార్క్ మాస్ ట్రీట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.
ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఇందులో ప్రతి పాత్రను ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు ఇప్పటికే బయటకు వచ్చిన కంటెంట్ ను బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా విజయ్ సేతుపతి గత సినిమాలకు భిన్నంగా కనిపిస్తుండటం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చూపు లేని బిచ్చగాడి పాత్రలో ఆయన కనిపించనుండటం ఈ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ గా మారింది. ఈ క్యారెక్టర్ లో ఆయన యాక్టింగ్ ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు, సినిమా షూటింగ్ పూర్తవడంతో మేకర్స్ రిలీజ్ కు సంబంధించిన ప్రణాళికలపై దృష్టి సారించింది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అఫీషియల్ గా అనౌన్స్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్(Charmme kaur) భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.








