వెంకటేష్ ఆదర్శ కుటుంబం.. అక్టోబర్ 30న రిలీజ్ కు ప్లాన్స్!
విక్టరీ వెంకటేష్(venkatesh), త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram srinivas) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆదర్శ కుటుంబం(Aadarsha kutumbam) రిలీజ్పై నెలకొన్న సందిగ్ధతకు తెరపడుతోంది. మొదట అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా పోస్ట్పోన్ అవడంతో కొత్త రిలీజ్ డేట్ పై ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. అయితే, మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోవడం, కొన్ని పాటలు ఇంకా రిలీజ్ కాకపోవడంతో సినిమా రిలీజ్పై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. తాజాగా నిర్మాత నాగవంశీ(Naga vamsi) ఈ సినిమాను అక్టోబర్ 30న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి.
ప్రస్తుతం వెంకటేష్ ఊటీలో జనవరి 12 విడుదల(january 12 vidudhala) సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. అక్టోబర్ 20న ఆయన హైదరాబాద్కు తిరిగి రానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అక్టోబర్ 22న ఆదర్శ కుటుంబం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ ఈవెంట్ లో వెంకటేష్ సినిమా రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫైనల్ స్టేజ్ కు చేరుకోవడంతో రిలీజ్ కు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది.
త్రివిక్రమ్ తనదైన శైలిలో రూపొందిస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి(Sreenidhi shetty) హీరోయిన్ గా నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ కు ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ (thaman) మ్యూజిక్ అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమా ట్రైలర్తో ఆడియన్స్ లో మరింత ఆసక్తిని పెంచుతుందా, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.








