షార్లెట్ లో అంగరంగ వైభోగంగా ‘‘తెలుగు సంబరాలు 2026’’
అమెరికాలోని షార్లెట్ లో తెలుగు సంబరాలు అంగరంగ వైభోగంగా జరిగాయి. ‘‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’’ పేరుతో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సైన్స్ ఫెస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే చిన్నారులు, పెద్దలు, యువత శాస్త్రీయ సంగీతం, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రేక్షకులను అలరించాయి. యనెవైపు సైన్స్ ఫెస్ట్ లో తొమ్మిది శాస్త్రీయ అంశాలపై ప్రయోగాలు, డెమోస్ట్రేషన్ ద్వారా చిన్నారులకు అవగాహన కలిగింది.
డ్రై బస్ ప్రయోగాలు, ప్లాస్మా బాల్ ప్రదర్శనలు కూడా ఆకట్టుకున్నాయి. ఈ తెలుగు సంబరాల్లో తానా (TANA),జీటీఏ (GTA),ఆప్టా (APTA)లాంటి తెలుగు సంఘాలు కూడా భాగస్వామ్యం అయ్యాయి. నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం సందర్భంగా సుమారు 800 మంది కొత్త రిజిస్ట్రేషన్లు నమోదు కావడం విశేషం.మరోవైపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కళాకారులు, చిన్నారులు, తల్లిదండ్రులు, వాలంటీర్లు,స్పాన్సర్లు, ప్రతినిధులు, ప్రేక్షకులకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.








