కలలతో అమెరికా వెళ్లి.. చివరికి కేన్సర్ తో మృత్యువాత
అద్భుతమైన కలలు కంటూ… ఆ కలలను అమెరికాకి వెళ్లి సాకారం చేసుకుందామనుకున్న ఓ యువకుడి జీవితం విషాద గాథగా ముగిసింది. అమెరికాకి వెళ్లిన కొంత కాలానికే కేన్సర్ అని నిర్ధారణ అయ్యింది. కేన్సర్ తో నాలుగు సంవత్సరాల పాటు పోరాటమే చేశాడు. చివరికి రెండు రోజుల క్రితం భరత్ పులిపాటి అనే తెలుగు యువకుడు అమెరికాలో తుదిశ్వాస విడిచాడు.
భరత్ పులిపాటి మృతిపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భరత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు.
ఏపీకి చెందిన భరత్ ఐదేళ్ల క్రితం అమెరికాకి వెళ్లాడు. కొంత కాలానికి కేన్సర్ బారిన పడటంతో అక్కడే చికిత్స పొందుతున్నాడు కూడా. అయితే.. ఆరోగ్యం విషమించడంతో టెక్సాస్ లోని ఆస్పత్రిలో చేరాడు. తన ఆరోగ్యం విషమిస్తుండటంతో భారత్ కి వెళ్లిపోతానని, అందుకే ఎయిర్ అంబులెన్స్ సాయం అవసమంటూ గతంలో వీడియో కూడా విడుదల చేశాడు. దీంతో తక్షణమే మంత్రి లోకేశ్ స్పందించి, కుటుంబీకులతో కూడా మాట్లాడారు. అయితే.. ఆరోగ్యం బాగోలేని కారణంగా ప్రయాణాలు కుదరవి వైద్యులు సూచించారు. దీంతో అఅక్కడే వుండిపోయాడు. చివరికి భరత్ కన్నుమూశాడు.








