దుబాయ్- హైదరాబాద్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
దుబాయ్ (Dubai) నుంచి హైదరాబాద్ (Hyderabad) వస్తున్న ఎమిరేట్స్ (Emirates flight) విమానం అత్యవసరంగా ముంబయి (లో ల్యాండైంది. ఓ ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో విమానాన్ని ముంబయి ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. వెంటనే విమానాశ్రయ సిబ్బంది ప్రయాణికుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రయాణికుడు హైదరాబాద్కు చెందిన వ్యక్తిగా అధికారులు భావిస్తున్నారు.








