“భగవంతుడు” మూవీ షూటింగ్ పూర్తి.. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు సిద్ధం!
యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్, యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా నటిస్తున్న తాజా చిత్రం “భగవంతుడు”. ఈ సినిమాలో కన్నడ నటుడు రిషి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రవి పనస ఫిలిం కార్పొరేషన్ (పనస మీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) బ్యానర్పై ప్రొడక్షన్ నంబర్ 1గా నిర్మాత రవి కుమార్ పనస నిర్మిస్తున్నారు. విద్యా శ్రీ పనస సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో జి.జి. విహారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న “భగవంతుడు” సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. సినిమా అవుట్పుట్ పట్ల చిత్ర బృందం సంతోషంగా ఉంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు తీసుకురానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్తో పాటు లిరికల్ సాంగ్స్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. సినిమా విడుదల కోసం ప్రేక్షకులు, మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








