నామినేషన్ల తొలిరోజే ఉద్రిక్తత .. వైసీపీ, టీడీపీ వర్గాల రాళ్ల దాడి
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల తొలిరోజే అన్నమయ్య జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని పుంగనూరు(Punganur), రాయచోటి (Rayachoti)లో వైసీపీ, టీడీపీ (TDP) వర్గాలు పరస్పరం ఘర్షణకు దిగాయి. నామినేషన్ల (Nominations) దాఖలు చేసేందుకు వెళ్తున్న క్రమంలో రెండు పార్టీల నేతలు దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో జరిగిన రాళ్లదాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. రాయచోటిలోని ఎస్ఎన్ కాలనీలో వాహనాలకు నిప్పంటించారు. పుంగనూరులో వైసీపీ (YSRCP) నేతల దాడిలో పలువురు టీడీపీ నేతలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకేసారి రెండు పార్టీలకు చెందిన నేతలు నామినేషన్లు వేసేందుకు వెళ్లడంతో ఈ ఘర్షణలు జరిగినట్లు సమాచారం.








