‘ప్రవాసాంధ్ర భరోసా బీమా’’ పై విద్యార్థులకు అవగాహన
విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం ఏపీఎన్ఆర్టీఎస్ (APNRTS) ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకంపై *ఏపీఎన్ఆర్టీ యూకే కోఆర్డినేటర్ లింగా రవితేజ తొలి విడత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీమా పథకం ప్రాముఖ్యతతో పాటు విద్యార్థులకు ఉపయోగపడే ఏపీఎన్ఆర్టీఎస్ సేవలను వివరించారు. ప్రతి విద్యార్థి ఏపీఎన్ఆర్టీఎస్లో నమోదు చేసుకొని, అందుబాటులో ఉన్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
విద్యాభ్యాసం కోసం లండన్కు వచ్చే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఏపీఎన్ఆర్టీఎస్ అండగా ఉంటుందని లింగా రవితేజ భరోసా ఇచ్చారు.








