రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో మంత్రి లోకేష్ భేటీ
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, సరస్ మేళాలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారితో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ ఉదయం విజయవాడ నోవాటెల్ హోటల్ కు వెళ్లిన మంత్రి లోకేష్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము గారిని శాలువాతో ఘనంగా సత్కరించి మంగళగిరి చేనేత చీర, ఏటికొప్పాక కళాకృతిని బహూకరించారు.









