‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ అవుతుంది – చిత్ర ప్రారంభోత్సవంలో హీరో సందీప్ కిషన్
సందీప్ కిషన్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మాణంలో యుగంధర్ ముని తెరకెక్కిస్తున్న చిత్రం ‘కరికాల’. ‘కరికాల’ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ‘కరికాల’ మొదటి చాప్టర్ 2027 జూలై 2న , రెండో చాప్టర్ 2027 అక్టోబర్ 28న విడుదల కాబోతోన్నట్టుగా మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గురువారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముగ్గురు కథానాయికలు కేథరిన్ థ్రెసా, గాయత్రి భరద్వాజ్, సాక్షి మడోల్కర్ సందడి చేశారు.
ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజశేఖర్ తల్లి సత్యవతి గారు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మహిధర్ తల్లి పద్మారెడ్డి గారు క్లాప్ కొట్టారు. తొలి సన్నివేశానికి ఆది సాయి కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత రాజశేఖర్ తండ్రి వీరభద్రాచారి గారు స్క్రిప్ట్‌ను అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించింది.
సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘‘కరికాల’ చిత్ర ప్రారంభోత్సవంలో నేను ముందుగా నా ఫ్రెండ్ ఆదికి థాంక్స్ చెప్పాలి. ఆది ‘శంబాల’ వల్లే యుగంధర్ గారు, రాజశేఖర్ గారు, మహిధర్ గారు పరిచయం అయ్యారు. కథ చెప్పడమే రెండు పార్టులుగా ఉంటుందని వివరించారు. అయితే నాకు ఒక్క నిమిషం కూడా బోర్ అనిపించలేదు. ఆరేడు నెలలుగా మా దర్శకుడు 24 గంటలు ఈ ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే బిజీగా ఉంటూ వచ్చారు. నిర్మాతలు కూడా ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తుంటారు. ఇలాంటి దర్శక, నిర్మాతలు నాకు దొరకడం ఆనందంగా ఉంది. ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ అవుతుందని అనుకుంటున్నాను. మా కథకు ఓకే చెప్పిన సాక్షి, గాయత్రి, కేథరిన్‌లకు థాంక్స్. శ్రీ చరణ్ ఈ సినిమాకి అద్భుతమైన ఆల్బమ్ రెడీ చేస్తున్నారు. ప్రతీ పాట అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. మాకెప్పుడూ సపోర్ట్ చేస్తున్న మీడియాకి థాంక్స్’ అని అన్నారు.
దర్శకుడు యుగంధర్ ముని మాట్లాడుతూ.. ‘‘నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాతలు రాజశేఖర్ గారు, మహిధర్ గారికి థాంక్స్. నాపై నమ్మకం పెట్టుకుని సినిమాకి ఓకే చెప్పిన సందీప్ కిషన్ గారికి థాంక్స్. అందమైన చందమామ కథలా ఈ చిత్రం ఉంటుంది. అందమైన ఊహా ప్రపంచం, నాగలోకం, వానర లోకం అని ఇలా ఓ ప్రపంచాన్ని క్రియేట్ చేయబోతోన్నాం. మేం రెండు పార్టులుగా సినిమాని ప్లాన్ చేశాం. వచ్చే ఏడాది మూవీని రిలీజ్ చేస్తామ’ని అన్నారు.
నిర్మాత రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘మా ‘శంబాల’ సినిమాకి మీడియా సపోర్ట్ చేసింది. అలానే మా ‘కరికాల’ చిత్రాన్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. వచ్చే వారం నుంచి మూవీ షూటింగ్‌ను ప్రారంభిస్తున్నాం. యుగంధర్ గారు ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించబోతోన్నారు. కథ విన్న వెంటనే సందీప్ గారు ఓకే చెప్పారు. మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
*కేథరిన్ థ్రెసా మాట్లాడుతూ* .. ‘‘కరికాల’ జర్నీని ఈ పూజా కార్యక్రమాలతో ప్రారంభిస్తున్నాం. చాలా రోజుల తర్వాత ఓ సినిమా గురించి, నా పాత్ర గురించి ఎంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నాను. యుగంధర్ గారు ఈ ప్రాజెక్ట్ కోసం, ఈ ప్రపంచాన్ని నిర్మించేందుకు ఎంతో కష్టపడుతున్నారు. ఆయన విజన్‌కి హ్యాట్సాఫ్. సందీప్ కిషన్ నాకు ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు. మేం ఇలా ఈ సినిమాకి కలిసి పని చేస్తుండటం ఆనందంగా ఉంది. రాజశేఖర్, మహిధర్ గార్లకు సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. మా టీంకి ఇలానే అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
గాయత్రి భరద్వాజ్ మాట్లాడుతూ.. ‘‘కరికాల’ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. దర్శక, నిర్మాతలు ప్రాణం పెట్టి సినిమాని చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అద్భుతంగా జరుగుతున్నాయి. వర్త్ వాచ్ అనేలా ఈ చిత్రం ఉంటుంది. ‘కరికాల’ సినిమా అందమైన మాయాలోకాన్ని చూపిస్తుంది. మాకు సపోర్ట్ చేస్తూ ప్రేమను కురిపిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు.
*సాక్షి మడోల్కర్ మాట్లాడుతూ* .. ‘‘కరికాల’ ప్రపంచం నాకెంతో నచ్చింది. ఇందులోని మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. ఇది నాకు తెలుగులో రెండో చిత్రం. ఇంత మంచి సినిమాలో సందీప్ కిషన్ పక్కన నటిస్తుండటం ఆనందంగా ఉంది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్.ఇలానే మా సినిమాకి ఎప్పుడూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ.. ‘సందీప్ కిషన్‌తో నాకు ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. ‘శంబాల’ తర్వాత మళ్లీ రాజశేఖర్ గారు, మహిధర్ గారు, యుగంధర్ గారితో పని చేస్తుండటం ఆనందంగా ఉంది. ఇది నా కెరీర్లో 58వ సినిమా. ఇలాంటి ఓ సినిమాకి పని చేస్తుండటం సంతోషంగా ఉంది. ‘కరికాల’తో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. ఇందులో మ్యూజిక్, పాటలకు ఎంతో స్కోప్ ఉంది. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.








